గడ్డ కట్టే చలిలో బన్నీ సాహసాలు

Monday,February 05,2018 - 12:11 by Z_CLU

నా పేరు సూర్య సినిమా కోసం నిజంగానే సాహసాలు చేస్తున్నాడు బన్నీ. గడ్డ కట్టించే చలిలో షూటింగ్ చేస్తున్నాడు. ఇండో-పాక్ బోర్డర్ లో మైనస్ 12 డిగ్రీల మంచులో ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు అల్లు అర్జున్. ఎంతో కష్టపడి తెరకెక్కిస్తున్న ఈ సన్నివేశాలు సినిమాకు హైలెట్ గా నిలిస్తాయని చెబుతున్నారు.

వక్కంతం వంశీ డైరక్ట్ చేస్తున్న నా పేరు సూర్య సినిమాకు సంబంధించి ఇప్పటికే ఓ సింగిల్ రిలీజైంది. సోషల్ మీడియాలో దానికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇప్పుడు సినిమా నుంచి సెకెండ్ సింగిల్ ను రిలీజ్ చేయబోతున్నారు. వాలంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న ఈ సాంగ్ విడుదలకానుంది.

విశాల్-శేఖర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో బన్నీ సరసన అను ఎమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది. రామలక్ష్మీ క్రియేషన్స్ బ్యానర్ పై లగడపాటి శిరీషా శ్రీధర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 27న థియేటర్లలోకి రానుంది నా పేరు సూర్య సినిమా.