Bangarraju - నా కోసం సాంగ్ ప్రోమో

Thursday,December 02,2021 - 04:20 by Z_CLU

కింగ్ నాగార్జున, నవ యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య కలిసి చేస్తున్న సినిమా బంగార్రాజు. ఇప్పటికే ఈ సినిమాపై హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే సినిమా ప్రమోషన్ జోరుగా సాగుతోంది. ఓవైపు షూటింగ్, మరోవైపు ప్రచారంతో యూనిట్ బిజీగా ఉంది. ఈ జోరును మరింత కొనసాగిస్తూ, ఈరోజు ఇంకో సాంగ్ ప్రోమో రిలీజైంది.

బంగార్రాజు సినిమాలో నాగచైతన్య-కృతిశెట్టి మధ్య ఓ బ్యూటిఫుల్ రొమాంటిక్ నంబర్ ఉంది. ఆ రొమాంటిక్ సాంగ్ ను స్టార్ సింగర్ సిద్ శ్రీరామ్ ఆలపించాడు. ఆ పాటకు సంబంధించిన ప్రోమోను ఈరోజు రిలీజ్ చేశారు. ఫుల్ లిరికల్ వీడియోను 5వ తేదీ సాయంత్రం 5 గంటల 12 నిమిషాలకు రిలీజ్ చేస్తారు.

బంగార్రాజు సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. గతంలో సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకు ఇతడే మ్యూజిక్ డైరక్టర్. అందుకే ప్రీక్వెల్ కు కూడా అనూప్ నే రిపీట్ చేశారు. బంగార్రాజు కోసం బంగారం లాంటి సాంగ్స్ ఇచ్చాడు అనూప్. లడ్డుండ అనే సాంగ్ ఇప్పటికే చాలా పెద్ద హిట్టయింది. ఇప్పుడా సాంగ్ ను క్రాస్ చేసేలా వస్తోంది సిద్ పాడిన ‘నా కోసం’ సాంగ్.

అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సత్యానంద్ స్క్రీన్ ప్లేను అందిస్తుండగా.. సినిమాటోగ్రఫర్‌గా యువరాజ్ పని చేస్తున్నాడు.