మరో రికార్డు సృష్టించిన బన్నీ సినిమా

Wednesday,January 03,2018 - 02:45 by Z_CLU

నా పేరు సూర్య ఫస్ట్ ఇంపాక్ట్… ది బెస్ట్ ఇంపాక్ట్ అనిపించుకుంది. సోషల్ మీడియాలో ఇలా విడుదలైందో లేదో అలా సూపర్ డూపర్ హిట్ అయింది ఈ మూవీ టీజర్. విడుదలైన కొన్ని గంటల్లోనే ఈ సినిమాకు ఏకంగా కోటి వ్యూస్ వచ్చాయంటే ఫస్ట్ ఇంపాక్ట్ ఎఫెక్ట్ ను అర్థంచేసుకోవచ్చు.

అవును.. బన్నీ నటించిన నా పేరు సూర్య టీజర్ కు జస్ట్ 29 గంటల్లో 10 మిలియన్ డిజిటల్ వ్యూస్ వచ్చాయి. యూట్యూబ్, ఫేస్ బుక్ కలిపి కౌంట్ ఇది. తన సినిమా టీజర్ కు అటుఇటుగా ఒక రోజులోనే కోటి వ్యూస్ రావడంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు బన్నీ. ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పాడు.

వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ నా పేరు సూర్య సినిమాలో నటిస్తున్నాడు బన్నీ. నా ఇల్లు ఇండియా అనేది ఈ మూవీ ట్యాగ్ లైన్. విశాల్-శేఖర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. రామలక్ష్మీ క్రియేషన్స్ బ్యానర్ పై లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు నాగబాబు సమర్పడిగా వ్యవహరిస్తున్నారు.