రేపే గ్రాండ్ గా ‘నా పేరు సూర్య’ ప్రీ రిలీజ్ ఈవెంట్

Saturday,April 28,2018 - 01:14 by Z_CLU

టాలీవుడ్ లో ‘నా పేరు సూర్య’ సినిమా చుట్టూ  ఆల్రెడీ బ్లాక్ బస్టర్ వైబ్స్ బిగిన్ అయిపోయాయి. ఈ రోజు రిలీజైన  ట్రైలర్ తరవాత సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా, నా పేరు సూర్య ఇంపాక్ట్ కనిపిస్తుంది. దానికి తోడు రేపు గచ్చిబౌలి స్టేడియంలో’నా పేరు సూర్య’ ప్రీ రిలీజ్ కి ఆల్రెడీ ఫ్యాన్స్ లో కౌంట్ డౌన్ బిగిన్ అయిపోయింది. 2 స్టేట్స్  నుండి భారీ స్థాయిలో మెగా ఫ్యాన్స్ ఈ ఈవెంట్ కి అటెండ్ కానున్నారు. నెవర్ సీన్ బిఫోర్ ఎలిమెంట్స్ తో విజువల్ ఫీస్ట్ లా జరగనుంది ‘నా పేరు సూర్య’ ప్రీ రిలీజ్ ఈవెంట్.

బన్నికి ఫ్యాన్స్ లో ఉన్న క్రేజ్ ని, దానితో పాటు ఈ సినిమా క్రియేట్ చేస్తున్న సెన్సేషన్ ని మైండ్ లో పెట్టుకుని, ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు ఫిలిమ్ మేకర్స్.  బాలీవుడ్ డ్యాన్సర్స్ పర్ఫామెన్సెస్ తో పాటు, మరెన్నో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఈ ఈవెంట్ లో హైలెట్ కానున్నాయి. వీటితో పాటు మెగా పవర్ స్టార్ ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా రావడం, మెగా ఫ్యాన్స్ లో వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తుంది. ఈ ఈవెంట్  ని రేపు సాయంత్రం 7 గంటల నుండి  ‘జీ  సినిమాలు’ ఛానల్ లో చూసి ఎంజాయ్ చేయండి.

 

వక్కంతం వంశీ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకి విశాల్ – శేఖర్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. లగడపాటి శ్రీధర్ ఈ సినిమాకి ప్రొడ్యూసర్.