‘నా పేరు సూర్య’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హైలెట్ కానున్న ఎలిమెంట్స్

Friday,April 27,2018 - 11:38 by Z_CLU

మే 4 న గ్రాండ్ గా రిలీజవుతుంది అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’. రీసెంట్ గా మిలిటరీ మాధవరంలో ఆడియో లాంచ్ జరుపుకున్న ఈ సినిమా, ఇప్పుడు హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో ఏప్రిల్ 29 న మరింత గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకోనుంది. మెగా పవర్ స్టార్  చీఫ్ గెస్ట్ గా రానున్న ఈ ఈవెంట్ టాలీవుడ్ లో వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తుంది.

భారీ స్థాయిలో మెగాఫ్యాన్స్ అటెండ్ కానున్న ఈ ఈవెంట్ లో బాలీవుడ్ డ్యాన్సర్స్ తో ఇంట్రెస్టింగ్ పర్ఫామెన్సెస్ ప్లాన్ చేస్తున్నారు ఫిల్మ్ మేకర్స్. ఇప్పటికే ఈ ఈవెంట్ కోసం భారీ సెట్ వేస్తున్న సినిమా యూనిట్, ఈ ఈవెంట్ లో మరెన్నో సర్ ప్రైజెస్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అనూ ఇమ్మాన్యువెల్ తో పాటు ‘నా పేరు సూర్య’ కంప్లీట్ టీమ్ పాల్గొననున్న ఈ ఈవెంట్ లో రామ్ చరణ్ తో పాటు బన్ని స్పీచ్ హైలెట్ కానుంది.

వక్కంతం వంశీ డైరెక్షన్ లో తెరకెక్కింది నా పేరు సూర్య. అల్లు అర్జున్ ని మోస్ట్ అగ్రెసివ్ మిలిటరీ ఆఫీసర్ గా ప్రెజెంట్ చేస్తున్న ఈ సినిమాలో శరత్ కుమార్, యాక్షన్ కింగ్ అర్జున్ కీ రోల్స్ ప్లే చేస్తున్నారు.