రేపటితో ‘నా పేరు సూర్య’ ఊటీ షెడ్యూల్ కి ప్యాకప్

Monday,October 09,2017 - 05:58 by Z_CLU

అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’ ఊటీ షెడ్యూల్ రేపటితో కంప్లీట్ కానుంది. మిలిటరీ బ్యాక్ డ్రాప్ లో అల్టిమేట్ యాక్షన్ ఎంటర్ టైనర్ లా తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 24 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. సినిమాకి సంబంధించిన కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్ లో తెరకెక్కించిన సినిమా యూనిట్ సక్సెస్ ఫుల్ గా ఈ షెడ్యూల్ కి ప్యాకప్ చెప్పనుంది.

అల్లు అర్జున్ సరసన అనూ ఇమ్మాన్యువెల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్, శరత్ కుమార్ కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. వక్కంతం వంశీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి విశాల్ -శేఖర్ మ్యూజిక్ కంపోజర్స్. ఈ సినిమాని ఏప్రియల్ 27 న రిలీజ్ చేసే ప్రాసెస్ లో ఉంది సినిమా యూనిట్.