నా పేరు సూర్య కొత్త షెడ్యూల్ ప్రారంభం

Tuesday,October 24,2017 - 01:31 by Z_CLU

మొన్నటివరకు ఊటీలో ఈ సినిమా షెడ్యూల్ ఏకథాటిగా జరిగింది. ఆ తర్వాత స్మాల్ గ్యాప్ తీసుకున్న యూనిట్, ఇవాళ్టి నుంచి మరో షెడ్యూల్ స్టార్ట్ చేసింది. నా పేరు సూర్య కొత్త షెడ్యూల్ హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో మొదలైంది. బన్నీపై ఓ యాక్షన్ బ్లాక్ తీస్తున్నారు. ఈ షూట్ 4 రోజుల పాటు కొనసాగుతుంది. తర్వాత యూనిట్ అంతా రామోజీ ఫిలింసిటీకి షిఫ్ట్ అవుతుంది.

నా పేరు సూర్య సినిమాతో వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. రామలక్ష్మీ క్రియేషన్స్ బ్యానర్ పై లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు నాగబాబు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 27న సినిమాను థియేటర్లలోకి తీసుకొస్తారు.

నా పేరు సూర్య సినిమాలో మిలట్రీ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు బన్నీ. ఈ క్యారెక్టర్ కోసం ఇప్పటికే ఫారిన్ ఫిట్ నెస్ ట్రయిలర్ నేతృత్వంలో ప్రత్యేకంగా మేకోవర్ అయ్యాడు. హెయిర్ స్టయిల్ కూడా మార్చాడు. బన్నీ లుక్ కచ్చితంగా ఆడియన్స్ కు నచ్చుతుందనే కాన్ఫిడెన్స్ తో ఉంది యూనిట్. సినిమాలో బన్నీ సరసన అను ఎమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. విశాల్-శేఖర్ సంగీతం అందిస్తున్నారు.