'నా పేరు సూర్య' మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభం

Tuesday,July 18,2017 - 01:14 by Z_CLU

నా పేరు సూర్య సినిమాకు సంబంధించి మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభమయ్యాయి. స్వయంగా బన్నీ ఇందులో పాల్గొంటున్నాడు. కేవలం ఈ మ్యూజిక్ సిట్టింగ్స్ లో పాల్గొనేందుకే ముంబయి వెళ్లాడు అల్లు అర్జున్.  నా పేరు సూర్య సినిమాకు సంగీతం అందిస్తున్న విశాల్-శేఖర్ కు ముంబయిలో స్టుడియోలో ఉంది. ఆ స్టుడియోలో సినిమాకు సంబంధించి సంగీత చర్చలు జరుగుతున్నాయి.

బన్నీ జాయిన్ అవ్వడాని కంటే ముందే కొన్ని ట్యూన్స్ సిద్ధం చేసి పెట్టింది ఈ సంగీత ద్వయం. అల్లు అర్జున్ సూచనల మేరకు వాటిలో కొన్ని ట్యూన్స్ కు మెరుగులు దిద్దుతున్నారు. సెట్స్ పైకి వెళ్లక ముందే కనీసం 2 సాంగ్స్ కంపోజిషన్ పూర్తిచేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారట.

వచ్చే నెల నుంచి నా పేరు సూర్య సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్టవుతుంది. హిమాచల్ ప్రదేశ్, జమ్ములోని కొన్ని ప్రాంతాల్లో ఈ సినిమాను షూట్ చేయబోతున్నారు. బన్నీ ఇందులో ఆర్మీ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. అను ఎమ్మాన్యుయేల్ ను హీరోయిన్ గా ఇప్పటికే ఫిక్స్ చేశారు.