'నా పేరు సూర్య' నెక్ట్స్ షెడ్యూల్ డీటెయిల్స్

Wednesday,September 13,2017 - 11:56 by Z_CLU

బన్నీ లేటెస్ట్ మూవీ నా పేరు సూర్య. నా ఇల్లు ఇండియా అనేది దీని ట్యాగ్ లైన్. కథా రచయిత వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా నడుస్తోంది. అన్నపూర్ణ స్టుడియోస్ లో వేసిన భారీ సెట్ లో కొన్ని యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నాడు. ఈ షూట్ తర్వాత ప్రారంభం కాబోయే షెడ్యూల్ వివరాల్ని యూనిట్ వెల్లడించింది.

ఈనెల 24 నుంచి నా పేరు సూర్య కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. ఊటీలో 15 రోజుల పాటు ఈ షెడ్యూల్ ఉంటుంది. ఈ సినిమా కోసం ఇప్పటికే మేకోవర్ అయ్యాడు బన్నీ. ఫారిన్ ఫిట్ నెస్ ట్రయిలర్ ఆధ్వర్యంలో న్యూ లుక్ లోకి వచ్చాడు. సినిమాలో బన్నీ సరసన అను ఎమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది.

రామలక్ష్మి సినీక్రియేషన్స్ బ్యానర్ పై లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు నాగబాబు ప్రజెంటర్ గా వ్యవహరిస్తున్నారు. విశాల్-శేఖర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ ఎట్రాక్షన్ గా నా పేరు సూర్య సినిమాను విడుదల చేయబోతున్నారు.