నా పేరు సూర్య లేటెస్ట్ అప్ డేట్స్

Tuesday,January 23,2018 - 03:42 by Z_CLU

వక్కంతం వంశీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘నా పేరు సూర్య’ ఫాట్స్ పేజ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతం పీటర్ హెయిన్స్ అధ్వర్యంలో హై ఇంటెన్సివ్ యాక్షన్ సీక్వెన్సెస్ ని తెరకెక్కిస్తుంది సినిమా యూనిట్. ఈ షెడ్యూల్ తరవాత మరో 25 రోజులు రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న సినిమా యూనిట్, ఈ షెడ్యూల్ తో షూటింగ్ కి  ప్యాకప్ చెప్పనుంది.

సినిమా సెట్స్ పై ఉండగానే రీసెంట్ గా ఫస్ట్ ఇంపాక్ట్ తో టాలీవుడ్ లో హీట్ ని జెనెరేట్ చేసిన ‘నా పేరు సూర్య’ టీమ్ జనవరి 26 న రిపబ్లిక్ డే సందర్భంగా ‘సైనిక’ అనే పవర్ ఫుల్ సాంగ్ ని రిలీజ్ చేయనుంది. అయితే ఈ సాంగ్ 25 సాయంత్రం నుండే యూ ట్యూబ్ లో అందుబాటులోకి రానుంది. పక్కా ప్లాన్డ్ గా పర్ఫెక్ట్ ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్న సినిమా యూనిట్, వ్యాలెంటైన్స్ డే రోజు ఈ సినిమా సెకండ్ సింగిల్ ని రిలీజ్ చేయనుంది.

అల్లు అర్జున్ సరసన అనూ ఇమ్మాన్యువెల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి విశాల్ -శేఖర్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. లగడపాటి శ్రీధర్, నాగబాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు.