నా పేరు సూర్య సాంగ్స్ – ఆల్బమ్ సూపర్ హిట్

Sunday,April 22,2018 - 09:18 by Z_CLU

మే 4 న గ్రాండ్ గా గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’. మిలిటరీ ఆఫీసర్ గా అల్లు అర్జున్ ని మోస్ట్ అగ్రెసివ్ ఆంగ్రీ మ్యాన్ లా ప్రెజెంట్ చేస్తున్న ఈ సినిమా, ఈ రోజు మిలిటరీ మాధవరంలో ఆడియో లాంచ్ జరుపుకుంది. అయితే ఇప్పటికే సందర్భానుసారంగా ఈ సినిమాలోని 3 సాంగ్స్ ని రిలీజ్ చేసిన ఫిలిమ్ మేకర్స్, తక్కిన 3 సాంగ్స్ ని ఈ రోజు రిలీజ్ చేశారు. ఈ సినిమాకి విశాల్ –శేఖర్ మ్యూజిక్ కంపోజ్ చేశారు.

సైనిక : ‘నా పేరు సూర్య’ రియల్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేసిన సాంగ్ ఇది. రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజైన ఈ పాటని  విశాల్ దద్లాని పాడాడు.  సరిహద్దుల్లో కాపలా ఉండే సైనికుల త్యాగం, గుండె ధైర్యాన్ని ఎలివేట్ చేస్తుందీ పాట.  రామజోయ్య శాస్త్రి రాసిన ‘తన భరోసా నువ్వే దేశం కొడకా..’ లాంటి లిరిక్స్, ఈ సాంగ్ రిలీజ్ అయినప్పుడే తెలుగు స్టేట్స్ లో వైబ్రేషన్స్ క్రియేట్ చేశాయి.

లవర్ ఆల్సో.. ఫైటర్ ఆల్సో:  ఫిబ్రవరి 14 న వ్యాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజైన సాంగ్. ఈ సాంగ్ సినిమాలోని రొమాంటిక్ ఆంగిల్ ని ఎలివేట్ చేస్తుంది. రామ జోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్, సినిమాలో మిలిటరీ ఆఫీసర్ సూర్యగా బన్ని ఎంత అగ్రెసివ్ గా ఉంటాడో, మరో యాంగిల్ లో అంతే లవబుల్ గా ఉంటాడు అని క్లారిటీ ఇస్తున్నాయి. ఈ పాటని శేఖర్ పాడాడు.

బ్యూటిఫుల్ లవ్ : ‘నా పేరు సూర్య’ ఆల్బమ్ మొత్తంలో మోస్ట్ మెలోడియస్ సాంగ్. ‘మనకథ బ్యూటిఫుల్ లవ్…’ అంటూ సాగే ఈ సాంగ్ రిలీజైన రోజే మ్యాగ్జిమం యూత్ ఫేవరేట్ లిస్టులో చేరిపోయింది. ఈ పాటకి సీతారామ శాస్త్రి లిరిక్స్ రాశాడు. చైత్ర అంబడిపూడి, అర్మాన్ మలిక్ ఈ పాట పాడారు.

మాయ : సిచ్యువేషన్ గెస్ చేయడం కష్టమే కానీ, సినిమాలో హెవీ ఇమోషనల్ సిచ్యువేషన్ లో ఉండబోయే సాంగ్. ‘అగ్గిలా రగిలిన ఆశయం ఎక్కడో, మాయమైనావులే నీలో నువ్వెప్పుడో..’ అనే లిరిక్, సినిమాలో హీరో ఒక రాంగ్ డెసిషన్ తీసుకుని, ఆ తరవాత రియలైజ్ అయ్యే మూమెంట్ లో ఉండబోతుందనిపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది 100% సిచ్యువేషనల్ సాంగ్.

ఎన్నియల్లో ఎన్నియల్లో  : తల్లీ కొడుకుల అనుబంధాన్ని ఎలివేట్ చేసే సాంగ్. దేశ సరిహద్దుల్లో ఉండి దేశాన్ని కంటికి రెప్పలా కాపలా కాసే  దేవుడంతటి వాడైనా, కన్నతల్లికి పసివాడే… అనే అర్థాన్నిచ్చే మోస్ట్ ఇమోషనల్  సాంగ్… రామ జోగయ్య శాస్త్రి రాసిన ఈ సాంగ్,  మాళవిక పాడింది.

ఇరగ ఇరగ : స్క్రీన్ పై జస్ట్ బన్ని మాత్రమే కాదు.. బన్ని ఫ్యాన్స్ చేత కూడా స్టెప్పులేయించే మాస్ సాంగ్. అల్లు అర్జున్, అనూ ఇమ్మన్యువేల్ కాంబినేషన్ లో ఉండే ఈ సాంగ్ రాహుల్ సిప్లిగంజ్, మోహన భోగరాజు కలిసి పాడారు. రామ జోగయ్య శాస్త్రి లిరిక్స్ రాశాడు.

సిచ్యువేషనల్ గా ఉండబోయే ఈ 6 సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి. విశాల్ – శేఖర్ కంపోజ్ చేసిన ఒక్కో పాట, సినిమాలోని సిచ్యువేషన్స్ ని ఎలివేట్ చేయడమే కాదు, స్క్రీన్ పై ఎప్పుడెప్పుడు చూస్తామా అనే రేంజ్ లో క్యూరాసిటీని రేజ్ చేస్తున్నాయి.