‘నా పేరు సూర్య’ ఫస్ట్ సింగిల్ అదిరింది

Friday,January 26,2018 - 08:41 by Z_CLU

రిపబ్లిక్ డే సందర్భంగా దేశ సరిహద్దుల్లో కాపలా కాసే సైనికులకు ట్రిబ్యూట్ గా ఈ రోజు ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసింది  సినిమా యూనిట్. సినిమా ఫస్ట్ ఇంపాక్ట్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఫిల్మ్ మేకర్స్, ‘ఇల్లే ఇండియా..’ అంటూ సాగే ఈ జోష్ ఫుల్ సాంగ్ తో ఫుల్ టూ ఇంప్రెస్ చేస్తుంది.

విశాల్ శేఖర్ కంపోజ్ చేసిన ఈ సింగిల్ కి రామ జోగయ్య శాస్త్రి లిరిక్స్ రాశారు. సైనికుడి మనో ధైర్యం, గొప్పతనాన్ని హైలెట్ చేస్తూ ఉన్న ఈ సాంగ్ స్టాండర్డ్స్ ని బట్టి, ఈ మూవీపై మరిన్ని ఎక్స్ పెక్టేషన్స్ రేజ్ అవుతున్నాయి. అల్లు అర్జున్ ని డిఫెరెంట్ గా ప్రెజెంట్ చేస్తూ మిలిటరీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా, నెవర్ సీన్ బిఫోర్ ఎలిమెంట్స్ ని స్క్రీన్ పై ఎలివేట్ చేయనుంది.

ఏప్రియల్ 27 న రిలీజ్ కానున్న ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ కీ రోల్ ప్లే చేస్తుండగా, అనూ ఇమ్మాన్యువెల్ హీరోయిన్ గా నటిస్తుంది. విశాల్- శేఖర్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. లగడపాటి శ్రీధర్, నాగబాబు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.