‘నా పేరు సూర్య’ సెట్ లో వక్కంతం వంశీ బర్త్ డే సెలబ్రేషన్స్

Wednesday,February 21,2018 - 03:48 by Z_CLU

నా పేరు సూర్య సినిమాతో దర్శకుడిగా మారిన వక్కంతం వంశీ ఈరోజు తన పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నాడు. నా పేరు సూర్య సినిమా సెట్స్ లోనే వక్కంతం బర్త్ డే వేడుకల్ని నిర్వహించారు. హీరో అల్లు అర్జున్ బొకే ఇచ్చి ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పాడు. బన్నీతో పాటు సీనియర్ నటుడు, యాక్షన్ కింగ్ అర్జున్, స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ నదియ, హీరోయిన్ అను ఎమ్మాన్యుయేల్.. వక్కంతం వంశీకి ప్రత్యేకంగా విశెష్ అందజేశారు. ఈ సెలబ్రేషన్స్ లో నిర్మాతలు లగడపాటి శ్రీధర్, బన్నీ వాస్ కూడా పాల్గొన్నారు.

కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న నా పేరు సూర్య సినిమా షూటింగ్ ప్రస్తుతం శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. బన్నీపై క్లయిమాక్స్ కు సంబంధించిన యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరిస్తున్నారు. ఈ సెట్స్ పైనే వక్కంతం వంశీ బర్త్ డే సెలబ్రేషన్స్ జరిగాయి.

మోస్ట్ సక్సెస్ ఫుల్ స్టోరీ రైటర్ గా పేరుతెచ్చుకున్నాడు వక్కంతం వంశీ. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు కథలు అందించిన ఈ స్టార్ రైటర్.. నా పేరు సూర్య అనే అద్భుతమైన స్టోరీ లైన్ తో బన్నీని ఒప్పించి, దర్శకుడిగా మారాడు. 90 శాతానికి పైగా షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 26న థియేటర్లలోకి రానుంది.