ఇంప్రెస్ చేస్తున్న ‘నా పేరు సూర్య’ బ్యూటిఫుల్ లవ్

Friday,April 13,2018 - 04:36 by Z_CLU

నా పేరు సూర్య థర్డ్ సింగిల్ రిలీజయింది. సైనిక, లవర్ ఆల్సో- ఫైటర్ ఆల్సో తరవాత రిలీజైన ఈ సాంగ్ ఇప్పుడు ఫ్యాన్స్ ని ఎట్రాక్ట్ చేస్తుంది. సీతారామ శాస్త్రి లిరిక్స్ రాసిన ఈ పాటను అర్మాన్ మాలిక్, చైత్ర కలిసి పాడారు. అల్టిమేట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ‘నా పేరు సూర్య’ సినిమాలోని సాఫ్ట్ జోన్ ని ఎలివేట్ చేస్తుందీ సాంగ్.

అల్లు అర్జున్ సరసన ఈ సినిమాలో అనూ ఇమ్మాన్యువెల్ నటించింది. ఇప్పటి వరకు రిలీజైన టీజర్, డైలాగ్ ఇంపాక్ట్ ని బట్టి అల్లు అర్జున్ యాంగ్రీ యంగ్ మిలిటరీ ఆఫీసర్ గా ప్రెజెంట్ చేస్తే, ఈ రోజు రిలీజైన ఈ ‘బ్యూటిఫుల్ లవ్’ సాంగ్ సినిమాలో బన్నిని రొమాంటిక్ ఆంగిల్ లో ప్రెజెంట్ చేస్తుంది. ప్లెజెంట్ మెలోడీ గా కంపోజ్ అయిన ఈ సాంగ్ సోషల్  మీడియాలో ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ చేస్తుంది.

విశాల్ – శేఖర్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్ తో పాటు శరత్ కుమార్ ఈ సినిమాలో కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. మే 4 న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ఈ సినిమా యూనిట్, త్వరలో ఈ మూవీ  ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జరుపుకునే ప్రాసెస్ లో ఉన్నారు.