NTR బయోపిక్ లో మరో పాప్యులర్ డైరెక్టర్

Thursday,September 27,2018 - 02:04 by Z_CLU

అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతుంది NTR బయోపిక్. NTR లైఫ్ లోని అతి ముఖ్యమైన ఘట్టాలను మరింత ఎట్రాక్టివ్ గా ప్రెజెంట్ చేసే ప్రాసెస్ లో ఉన్న ఫిలిమ్ మేకర్స్, కాస్టింగ్ విషయంలో కూడా అంతే పర్టికులర్ గా ఉన్నారు. ఇప్పటికే బాలీవుడ్ నుండి విద్యా బాలన్, ANR రోల్ కోసం సుమంత్ ని ఫిక్స్ చేసుకున్న టీమ్, దర్శకుడు విఠలాచార్య రోల్ కోసం N. శంకర్ ని ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తుంది.

ఈ విషయంలో అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రాలేదు కానీ, ఇన్ సైడ్ సోర్సెస్ ప్రకారం N. శంకర్, బాలయ్య కాంబినేషన్ లో కొన్ని సీన్స్ ఇప్పటికే తెరకెక్కించేశారని తెలుస్తుంది. NTR నటించిన అగ్గిపిడుగు, గండికోట రహస్యం, ఆలీబాబా 40 దొంగలు లాంటి మరెన్నో సూపర్ హిట్ సినిమాలకు విఠలాచార్య దర్శకత్వం వహించారు.

 

 

ఈ సినిమాకి కీరవాణి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. బాలకృష్ణ, విష్ణు ఇందూరి, సాయి కొర్రపాటి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేసే ప్రాసెస్ లో ఉన్నారు ఫిలిమ్ మేకర్స్. క్రిష్ ఈ సినిమాకి డైరెక్టర్.