ఎక్స్ క్లూజీవ్: ఆ సినిమాతో బాలీవుడ్ లోకి మైత్రి

Monday,July 13,2020 - 01:34 by Z_CLU

తెలుగు నిర్మాణ సంస్థలు బాలీవుడ్ లో కూడా కొన్ని రిమేక్ సినిమాలతో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ‘F2’ సినిమాతో దిల్ రాజు బాలీవుడ్ కి నిర్మాతగా పరిచయం అవుతున్నాడు. బోణీ కపూర్ తో కలిసి ఆ సినిమాను హిందీలో రిమేక్ చేయనున్నాడు దిల్ రాజు. ఇక అల్లు అరవింద్, దిల్ రాజు, నాగవంశీ ముగ్గురు కలిసి ‘జెర్సీ’సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇప్పుడు అదే కోవలో మైత్రి సంస్థ కూడా ఓ రీమేక్ తో బాలీవుడ్ లోకి ఎంటరవుతోంది. ఇటివలే కీరవాణి తనయుడు సింహాను హీరోగా పరిచయం చేస్తూ మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ‘మత్తు వదలరా’ అనే చిన్న సినిమాను నిర్మించింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఆ సినిమా తెలుగులో మంచి విజయం అందుకుంది.

చిన్న బడ్జెట్ తో తీసిన సినిమా కావడంతో లాభాలు కూడా వచ్చాయి. ఇప్పుడీ సినిమాను హిందీ లో రీమేక్ చేయబోతున్నారు మైత్రి నిర్మాతలు. ఈ రీమేక్ ను ఒరిజినల్ డైరెక్టర్ రితేష్ రానా డైరెక్ట్ చేయబోతున్నాడు. ప్రస్తుతం దర్శకుడు రితేష్ హిందీ రీమేక్ కి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడు. అది అవ్వగానే క్యాస్టింగ్, టెక్నికల్ టీం ను ఫైనల్ చేస్తాడు.

మరి ఈ చిన్న బడ్జెట్ సినిమాతో మైత్రి సంస్థ బాలీవుడ్ లో ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి.