పుట్టినరోజు కానుక - మహేష్ నుంచి మరో మూవీ

Thursday,August 09,2018 - 12:15 by Z_CLU

ఈరోజు తన 43వ పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నాడు మహేష్. ఈ బర్త్ డే సందర్భంగా అతడు నటిస్తున్న 25వ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్, టీజర్ రిలీజ్ చేశారు. దీంతో పాటు మరో గుడ్ న్యూస్ కూడా అందించాడు సూపర్ స్టార్. తన నెక్ట్స్ మూవీ డీటెయిల్స్ ను బయటపెట్టాడు.

అవును.. పుట్టినరోజు సందర్భంగా మహేష్ నెక్ట్స్ మూవీ వివరాల్ని అఫీషియల్ గా ప్రకటించారు. ఈ మేరకు మహేష్ తో నెక్ట్స్ సినిమా చేయబోతున్నట్టు మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. ఈ ప్రాజెక్టును డైరక్టర్ సుకుమార్ హ్యాండిల్ చేసే ఛాన్స్ ఉంది.

మహేష్ తో ఓ సినిమా చేయబోతున్నట్టు సుక్కూ ఇప్పటికే ప్రకటించాడు. మైత్రీ మూవీ మేకర్స్ పైనే అది ఉంటుందని కూడా స్పష్టంచేశాడు. తాజాగా మైత్రీ మేకర్స్ కూడా పోస్టర్ రిలీజ్ చేయడంతో, ప్రాజెక్టు లాక్ అయింది. మహర్షి మూవీ కంప్లీట్ అయిన వెంటనే, 26వ సినిమా స్టార్ట్ చేస్తాడు మహేష్.