అవన్నీ రూమర్లే...

Thursday,December 08,2016 - 09:00 by Z_CLU

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ సినిమా ‘ధృవ’. సురేందర్ రెడ్డి దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా రేపు వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి అందరిలోనూ ఇంట్రెస్ట్ కలగజేస్తున్నారు యూనిట్.. ఆ ఇంటరెస్టింగ్ ఎలిమెంట్ సినిమాకు చాలా ఇంపార్టెంట్ అంటూ చెప్పుకొస్తున్నారు కూడా.

dhruva-working-still

అదేంటా? అనుకుంటున్నారా? ఆ ఇంటరెస్టింగ్ ఎలిమెంట్ మరేదో కాదు. టైటిల్ లో ఉన్న నంబర్ 8 అయితే ఈ నంబర్ కు సినిమాకు సంబంధం ఏమిటి? అసలు ఈ నంబర్ టైటిల్ లో ఎందుకు పెట్టారు? అనే ప్రశ్న ఫస్ట్ లుక్ రిలీజ్ నుండి అందరిలో మొదలైంది. అయితే డైరెక్టర్ సురేందర్ రెడ్డి కి ఇది 8 సినిమా కావడంతో ఇలా టైటిల్ లో పెట్టారనే వార్త కూడా చక్కర్లు కొట్టింది. అయితే తనకి 8వ సినిమా కావడం వల్లే ఈ నంబర్ పెట్టామనే వార్తలో నిజం లేదని అవన్నీ రూమర్లే అని అంటున్నాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. 8 నంబర్ సినిమాకు చాలా ముఖ్యమని.. ఒరిజినల్ వెర్షన్ కు, ‘ధృవ’ కి కాస్త డిఫరెంట్ చూపించే ఎలిమెంట్ ఇదేనంటున్నాడు సురేందర్. ఆ కీలకమైన ఎలిమెంట్ ఏంటనేది సినిమా చూసి తెలుసుకోవాలని అంటున్నాడు.