నాకింకా పెళ్ళి కాలేదు

Monday,October 17,2016 - 12:53 by Z_CLU

కీర్తి సురేష్ కి పెళ్లై పోయింది. ఆ.. ఏముందిలే… ఎంత మంది స్టార్ హీరోయిన్ లు పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదూ… తను కూడా పెళ్లి చేసుకుంది. అనుకుని లైట్ తీసుకుందామనుకుంటే, కీర్తి సురేష్ అందరిలా పబ్లిక్ గా, ఆడంబరంగా పెళ్ళి చేసుకోలేదు. సీక్రెట్ గా పెళ్లి చేసేసుకుందట. అసలు కీర్తికి మరీ ఇంత సీక్రెట్ గా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది..? ఈ పాయింటే సోషల్ మీడియాలో వైరల్ అయి కూర్చుంది.

keerthi-suresh-hot-photo

కెరీర్ పీక్ స్టేజ్ లో ఉంది అనడం కంటే, కీర్తి ఇంకా సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకునే స్టేజ్ లోనే ఉంది అనడం కరెక్ట్. తమిళనాట స్టార్ హీరోల సరసన నటిస్తున్నా ఇంకో రెండేళ్ళు, ఇలాగే ఇంతే స్పీడ్ కొనసాగితేనే కీర్తి టాప్ హీరోయిన్ అవుతుంది. ఇలాంటి టైంలో పెళ్ళి చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్..? అని ఆలోచించే లోపే కీర్తి  ఈ విషయంలో క్లారిటీ ఇచ్చేసింది.

capture

మీడియాలో గగ్గోలుపెడుతున్నట్టుగా అసలు తనకు పెళ్ళే జరగలేదని, ఇక ఫోటోల విషయానికి వస్తే, అవి కేవలం ఒక సినిమా షూటింగ్ లో భాగంగా జరిగిన పెళ్ళి మాత్రమేనని, దానికి తమిళ మీడియా ఇంత రాద్దాంతం చేసిందని ఏడుపుమొహంతో క్లారిటీ ఇచ్చింది మన టాలీవుడ్ శైలజ.