నా నెక్ట్స్ సినిమా కంప్లీట్ కమర్షియల్ - కొరటాల

Saturday,May 05,2018 - 12:30 by Z_CLU

అందర్నీ ప్రేమించమనే సందేశం ఉంటుంది మిర్చి సినిమాలో. ప్రకృతి కాపాడదామనే మెసేజ్ జనతా గ్యారేజీలో కనిపిస్తుంది. గ్రామాల్ని దత్తత తీసుకోవాలనే కాన్సెప్ట్ శ్రీమంతుడులో ఉంది. ఇక తాజాగా వచ్చిన భరత్ అనే నేను సినిమాలో స్థానిక స్వపరిపాలన (లోకల్ గవర్నెన్స్), ట్రాఫిక్ రెగ్యులరేషన్స్ లాంటి ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇలా తను తీసిన ప్రతి సినిమాతో ఓ మెసేజ్ ఇవ్వడానికి ప్రయత్నించాడు దర్శకుడు కొరటాల శివ

మరి ఈ దర్శకుడు తీయబోయే నెక్ట్స్ సినిమాలో ఎలాంటి సందేశం ఉండబోతోంది. ఇక్కడే కొరటాల షాక్ ఇచ్చాడు. తన నెక్ట్స్ మూవీలో ఎలాంటి మెసేజీలు ఉండవని, పక్కా కమర్షియల్ సినిమా చేస్తానని ప్రకటించాడు. ఆ సినిమాలో ఎలాంటి సందేశాలు ఉండవని, కేవలం మంచి పాటలు, ఫైట్లు, కామెడీ మాత్రమే ఉంటాయని చెబుతున్నాడు.

అయితే రాబోయే సినిమాలో హీరో ఎవరనేది మాత్రం చెప్పలేదు కొరటాల. త్వరలోనే డిసైడ్ చేస్తానని అంటున్నాడు. కానీ తాజా సమాచారం ప్రకారం.. అక్కినేని అఖిల్ ను కొరటాల డైరక్ట్ చేసే ఛాన్స్ ఉందంటూ పుకార్లు వినిపిస్తున్నాయి.