నా ఫ్యాన్సే నా ఆర్మీ – అల్లు అర్జున్

Monday,April 30,2018 - 01:05 by Z_CLU

నిన్న హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో గ్రాండ్ గా జరిగింది ‘నా పేరు సూర్య’ ప్రీ రిలీజ్ ఈవెంట్. రిలీజ్ కి ముందే ఈ సినిమా క్రియేట్ చేస్తున్న వైబ్స్ ని మైండ్ లో పెట్టుకుని, ఈ ఈవెంట్ ని మరింత  గ్రాండ్ గా  నిర్వహించారు ఫిల్మ్ మేకర్స్. ఈ ఈవెంట్ లో దర్శకుడు వక్కంతం వంశీనుద్దేశించి బన్ని ఇచ్చిన స్పీచ్ హైలెట్ గా నిలిచింది.

‘ఒక హానెస్ట్ సినిమా చేయాలి అనే నా కోరిక,  అద్భుతంగా రాసుకున్న  మీ కథ కలిసిన ఆ క్షణం నా అదృష్టంగా ఫీలవుతున్నాను. ఈ సినిమా సక్సెస్ అవ్వడానికి 100 కారణాలు ఉంటే, ఆ కారణాలన్నీ ఈ సినిమా డైరెక్టర్ వక్కంతం వంశీ గారే. ఈ సినిమా క్రెడిట్ మొత్తం దర్శకుడికే దక్కుతుంది. ఈ సినిమా కోసం నేనేదైనా చేసి ఉంటే, అది నా డైరెక్టర్ ని బ్లైండ్ గా నమ్మడమే. ఈ సినిమా గురించి ఎక్కువ మాట్లాడటం నాకిష్టం లేదు కానీ, ఒక్క మాట మాత్రం చెప్తాను. ఈ సినిమా నేను గర్వించే సినిమా అవుతుంది.’  అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పుకున్నాడు బన్ని.

 

నిన్న జరిగిన ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భారీగా తరలి వచ్చిన ఫ్యాన్స్ తో ‘మీరే నా ఆర్మీ…’ అని చెప్పుకున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. మెగా పవర్ స్టార్ ఈ ఈవెంట్  లో  చీఫ్ గెస్ట్ లా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాడు. గ్రాండ్  సక్సెస్  అయిన  ప్రీ రిలీజ్ ఈవెంట్   సినిమా పై మరిన్ని  ఎక్స్ పెక్టేషన్స్  రికార్డ్ చేస్తుంది. ఈ సినిమా చుట్టూ  క్రియేట్ అవుతున్న ప్రీ రిలీజ్ వైబ్స్  ని బట్టి, ‘నా పేరు సూర్య’  బన్ని కరియర్ లో బెస్ట్ ప్లేస్  ని ఆక్యుపై  చేయడం గ్యారంటీ  అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.

 

 భారీ కమర్షియల్ వ్యాల్యూస్ తో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్ టైనర్ లా తెరకెక్కిన ఈ సినిమా, మే 4 న గ్రాండ్ రిలీజ్ కి రెడీగా ఉంది. శరత్ కుమార్, యాక్షన్ కింగ్ అర్జున్ కీ రోల్స్ ప్లే చేసిన ఈ సినిమాలో అనూ ఇమ్మాన్యువెల్ హీరోయిన్ గా నటించింది. విశాల్ – శేఖర్ మ్యూజిక్ కంపోజర్స్.