నా కెరీర్ లో ది బెస్ట్ -చిరంజీవి

Tuesday,August 22,2017 - 04:32 by Z_CLU

రీసెంట్ గా ‘ఖైదీ నంబర్ 150’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మెగాస్టార్ చిరు ప్రెజెంట్ 151వ సినిమా ‘సైరా నర్సింహా రెడ్డి’ తో సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతున్నాడు. తాజాగా తన పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి మోషన్ పోస్టర్ తో అందరినీ ఎట్రాక్ట్ చేస్తున్న చిరు ఈ సినిమా గురించి అభిమానులతో మాట్లాడాడు…

హైదరాబాద్లో జరిగిన పుట్టినరోజు వేడుకలో ఏవీ ద్వారా చిరు మాట్లాడుతూ “నన్ను ఇంతగా అభిమానించే అభిమానులు నాకు అండగా ఉండడం నా తల్లి తండ్రుల పుణ్యం , నా అదృష్టం. నిజానికి మీకు నేను ఏం ఇవ్వగలను సినిమా తప్ప..అందుకే మళ్ళీ మీ కోసమే సినిమాలు చేస్తున్నాను.. ఇక ఎప్పటి నుంచో స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ కథతో సినిమా చేయాలనుకున్నాను..కానీ కుదరలేదు. ఇప్పుడు 151 వ సినిమాగా స్వాతంత్ర సమరయోధుడు, మన తెలుగు బిడ్డ ఉయ్యాలవాడ నర్సింహా రెడ్డి కథతో చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. నిజానికి ఈ రోల్ నాకు పెద్ద ఛాలెంజింగ్. సైరా నర్సింహా రెడ్డి అనే టైటిల్ మీకు బాగా నచ్చుతుందని ఆశిస్తున్నాను.  ఈ సినిమా విషయంలో దర్శకుడిగా సురేందర్ రెడ్డి తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్దని అభినందించాల్సిందే. ప్రముఖులు, అత్యున్నత సాంకేతిక నిపుణులు పని చేస్తున్న ఈ సినిమా నా కెరీర్ లో ది బెస్ట్ కానుంది. దర్శకుడిగా మన తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన రాజమౌళి ఈ సినిమా మోషన్ పోస్టర్ ను లాంచ్ చేయడం ఆనందంగా ఉంది.” అన్నారు.