నా ఆల్ టైం ఫేవరెట్ మూవీ - కొరటాల శివ

Wednesday,May 02,2018 - 07:17 by Z_CLU

ఇప్పటివరకు నాలుగు సినిమాలు తీశాడు. నాలుగూ బ్లాక్ బస్టర్సే. మరీ ముఖ్యంగా రీసెంట్ గా రిలీజైన భరత్ అనే నేను సినిమా భారీ విజయం సాధించింది. కొరటాల తీసిన నాలుగు సినిమాల్లో ఇదే పెద్ద విజయం. కాబట్టి తను తీసిన సినిమాల్లో కొరటాలకు ఇష్టమైన సినిమా ఇదే అయి అంటుందని ఎవరైనా భావిస్తారు. కానీ కొరటాలకు నచ్చిన సినిమా ఇది కాదు.

అవును.. భరత్ అనే నేను సినిమా కంటే వ్యక్తిగతంగా కొరటాలకు ఇష్టమైన సినిమా శ్రీమంతుడు. మహేష్ తో ఫస్ట్ టైం కలిసి పనిచేసిన శ్రీమంతుడు సినిమా అంటే తనకు పర్సనల్ గా చాలా ఇష్టం అంటున్నాడు కొరటాల. ఆ సినిమా స్టోరీలైన్, స్క్రీన్ ప్లే, నటీనటులు, టెక్నీషియన్స్.. ఇలా అన్నీ పెర్ ఫెక్ట్ గా సింక్ అయ్యాయని, మళ్లీ అలాంటి కూర్పు భవిష్యత్తులో సెట్ అవ్వదని అంటున్నాడు.

తను చెప్పాలనుకున్న పాయింట్ ను ఫుల్ లెంగ్త్ లో శ్రీమంతుడు సినిమాలో చెప్పగలిగానని, అందుకే ఆ సినిమా అంటే తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చాడు. భవిష్యత్తులో తను ఎన్ని సినిమాలు డైరక్ట్ చేసినా, తన మనసులో మాత్రం శ్రీమంతుడే ఉంటాడంటున్నాడు కొరటాల. మీడియా మిత్రులతో పర్సనల్ గా మాట్లాడుతూ ఈ విషయాన్ని బయటపెట్టాడు ఈ స్టార్ డైరక్టర్.