మెగా అప్ డేట్.. మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభం

Monday,December 02,2019 - 02:38 by Z_CLU

మెగాస్టార్ చిరంజీవి అప్ కమింగ్ సినిమాకు సంబంధించి మెగా అప్ డేట్ వచ్చేసింది. కొరటాల దర్శకత్వంలో చిరంజీవి చేయబోయే సినిమాకు సంబంధించి మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభమయ్యాయి. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

ప్రస్తుతం చిరంజీవి, కొరటాల శివ, మణిశర్మ బ్యాంకాక్ లో ఉన్నారు. సినిమాకు కనీసం 3 ట్యూన్స్ ఫైనల్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ట్యూన్స్ ఓకే అయిన వెంటనే రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. గతంలో చిరంజీవి నటించిన స్టాలిన్ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ ఇచ్చాడు. ఆ తర్వాత చిరు సినిమాకు వర్క్ చేయడం ఇదే.

అటు కొరటాలతో కూడా మణిశర్మకు ఇదే ఫస్ట్ ప్రాజెక్టు. ఇంతకుముందు కొరటాల చేసిన సినిమాలన్నింటికీ దేవిశ్రీప్రసాద్ వర్క్ చేశాడు. రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మించబోతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈనెలాఖరు నుంచి లేదా జనవరి నుంచి ప్రారంభమౌతుంది.