సిల్వర్ స్క్రీన్ పై సిసలైన మల్టీస్టారర్

Monday,September 12,2016 - 10:30 by Z_CLU

 

ఇప్పటికే కొన్ని మల్టీస్టారర్లు వచ్చాయి. ప్రేక్షకులను బాగానే అలరించాయి. ఇంకొన్ని కూడా లైన్లో ఉన్నాయి. కానీ వెండితెరపై అల్టిమేట్ మల్టీస్టారర్లుగా చెప్పుకునే కాంబినేషన్లు కొన్ని ఉన్నాయి. గ్యాప్ లేకుండా ప్రతిసారి అభిమానులు మాట్లాడుకునే క్రేజీ కాంబోలవి. అయితే ఈసారి సోషల్ మీడియాలో చర్చ ఇంకాస్త ముందుకెళ్లింది. అలాంటి క్రేజీ కాంబినేషన్ ను ఎవరు డైరక్ట్ చేస్తే బాగుంటుందనే ఇంట్రెస్టింగ్ చర్చ తాజాగా నడిచింది.

chiru-pawan-rajamouli

చిరంజీవి-పవన్ కల్యాణ్… మెగాకాంపౌండ్ కు మూలస్తంభాలు. తెలుగుతెరపై తిరుగులేని హీరోలుగా పాపులర్ అయిన వీళ్లిద్దరూ కలిసి ఓ సినిమా చేస్తే చూడాలని ప్రతి అభిమాని కోరుకుంటారు. అయితే రాజమౌళి దర్శకత్వంలో ఈ కాంబినేషన్ వస్తే ఇంకా బాగుంటుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. కానీ ఇది వర్కవుట్ అవుతుందా లేదా అనేది మాత్రం ఎవరికీ తెలీదు.

collage

ఇక నాగార్జున-వెంకటేష్ ది కూడా సూపర్బ్ కాంబినేషన్. వీళ్లిద్దరూ కలిసి ఓ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో కలిసి నటిస్తే బాగుంటుందని నెటిజన్లు ఫీల్ అయ్యారు. మరీ ముఖ్యంగా సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు లాంటి సినిమా అయితే ఇంకా బాగుంటుందని…. ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో నాగ్-వెంకీ కలిసి నటిస్తే చరిత్రలో నిలిచిపోతుందని ఫేస్ బుక్ లో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ సాగింది.

balayya-boyapati-ntr

 

మాస్ కే కేరాఫ్ అడ్రస్ గా నిలిచే బాలయ్య-ఎన్టీఆర్ కాంబినేషన్ ఎప్పట్నుంచో ఫిలింసర్కిల్ లో చక్కర్లు కొడుతూనే ఉంది. బాబాయ్ ఒక్క మాట అడిగితే చాలు.. అతని సినిమాలో ఎలాంటి పాత్రనైనా చేసేందుకు ఎన్టీఆర్ ఎప్పుడూ సిద్ధమే. అయితే ఈక్వెల్ రోల్స్ లో బాలకృష్ణ, ఎన్టీఆర్ ను హీరోలుగా పెట్టి… బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా వస్తే బాగుంటుందని నందమూరి అభిమానులు కోరుకుంటున్నారు. ఈ కాంబినేషన్లు తెరపైకి వస్తాయో రావో ఇప్పుడే చెప్పలేం. వస్తే మాత్రం అవి చరిత్రలో నిలిచిపోవడం ఖాయం.