MS Raju's 7 Days 6 Nights - మూవీ అప్ డేట్స్

Monday,June 28,2021 - 09:34 by Z_CLU

MS Raju’s 7 Days 6 Nights Movie Shooting Updates

రీసెంట్ గా డర్టీ హరి అంటూ ఓ అడల్ట్ సినిమా తీసిన ప్రముఖ నిర్మాత ఎమ్మెస్ రాజు, ఇప్పుడు తన దర్శకత్వంలో మరో సినిమా మొదలుపెట్టారు. ‘డర్టీ హరి’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎంఎస్ రాజు దర్శకత్వం వహిస్తున్న తాజా సినిమా ‘7 డేస్ 6 నైట్స్’.

ఎంఎస్ రాజు దర్శకత్వంలో సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో వైల్డ్ హనీ ప్రొడక్షన్ పతాకంపై రూపొందుతున్న సినిమా ఇది.

ms raju 7 days 6 nights movie 2

ఈ చిత్రానికి సుమంత్ అశ్విన్, రజనీకాంత్ నిర్మాతలు. ఈ నెల 21న హైదరాబాద్ లో సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. ప్రస్తుతం ఫస్ట్ షెడ్యూల్ నడుస్తోంది. ఈ సినిమాతో పదిహేనేళ్ల కుర్రాడు సమర్థ్ గొల్లపూడిని సంగీత దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. పాటలు, నేపథ్య సంగీతం చాలా కొత్తగా, అల్ట్రా
మోడ్రన్‌గా ఉండాలనే ఉద్దేశంతో అతడిని తీసుకున్నారు. ప్రస్తుత అగ్ర సంగీత దర్శకులలో ఒకరైన దేవిశ్రీ ప్రసాద్‌ను ఎంఎస్ రాజుగారు పరిచయం చేసిన సంగతి తెలిసిందే.

ms raju 7 days 6 nights movie 1

జూలై 10 వరకూ ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కొనసాగుతుంది. ఆ తర్వాత 15 నుంచి గోవా, మంగుళూరు, ఉడిపి, అండమాన్ నికోబర్ దీవుల్లో నెల పాటు మరో షెడ్యూల్ ప్లాన్ చేశారు. దీంతో టోటల్ షూటింగ్ పూర్తవుతుంది. సెప్టెంబర్ రెండో వారంలో చిత్రాన్ని విడుదలకు సిద్ధం చేస్తున్నారు.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics