వరుణ్ తేజ్ సినిమాకు హీరోయిన్ ఫిక్స్

Monday,April 01,2019 - 04:51 by Z_CLU

తమిళ్ లో సూపర్ హిట్ గా నిలిచిన ‘జిగార్తాండ’ ను హరీష్ శంకర్ తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.. ‘వాల్మీకీ’ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ నెగిటీవ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ ప్లే చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా కోలీవుడ్  యాక్ట్రెస్ మృణాళిని రవి ఫైనల్ చేసుకున్నారట మేకర్స్. ఇటివలే ‘సూపర్ డీలక్స్’ అనే తమిళ్ సినిమాలో ఓ క్యారెక్టర్ చేసిన ఈ బ్యూటీ ని లక్ష్మీ రాయ్ చేసిన క్యారెక్టర్ కి సెలెక్ట్ చేసారని తెలుస్తోంది.

ఇప్పటికే మృణాళిని పై ఓ టెస్ట్ షూట్ కూడా చేసారని సమాచారం. సిద్దార్థ్ చేసిన క్యారెక్టర్ ని తెలుగులో అధర్వ చేస్తున్నాడు. వరుణ్ తేజ్ ఈ నెలలోనే షూటింగ్ లో జాయిన్ అవుతాడు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది.