మిస్టర్ మజ్ను టైటిల్ సాంగ్.. ఇనిస్టెంట్ హిట్

Wednesday,December 26,2018 - 12:18 by Z_CLU

అక్కినేని అఖిల్ నటిస్తున్న మూడో సినిమా మిస్టర్ మజ్ను. వెంకీ అట్లూరి డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రమోషన్ స్టార్ట్ అయింది. ఇందులో భాగంగా మిస్టర్ మజ్ను టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు. తమన్ కంపోజ్ చేసిన ఈ పాట ఇనిస్టెంట్ గా హిట్ అయింది.

సినిమాలో అఖిల్ క్యారెక్టరైజేషన్ ను ఎలివేట్ చేస్తూ సాగే ఈ పాటకు శ్రీమణి సాహిత్యం అందించాడు. రీసెంట్ టైమ్స్ లో ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్న తమన్, ఈ లిరిక్స్ ను క్యాచీ ట్యూన్ గా మార్చేశాడు. క్రిస్మస్ కానుకగా ఈ పాట ఇలా రిలీజైన వెంటనే అలా యూత్ ఫేవరెట్ గా మారిపోయింది. రమ్య NSK ఈ పాట పాడాడు.

ప్రస్తుతం మిస్టర్ మజ్ను ఫైనల్ షెడ్యూల్ లో ఉంది. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను జనవరి 25న వరల్డ్ వైడ్ రిలీజ్ చేయబోతున్నారు.