మిస్టర్ మజ్ను ఆడియో రిలీజ్

Monday,January 14,2019 - 03:35 by Z_CLU

అక్కినేని యంగ్ తరంగ్ అఖిల్ నటిస్తున్న లవ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ మిస్టర్ మజ్ను. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ఆడియో సాంగ్స్ రిలీజ్ చేశారు. టోటల్ జూక్ బాక్స్ ను యూట్యూబ్ లో పెట్టారు. తమన్ ఈ సినిమాకు మ్యూజిక్ ఇచ్చాడు

సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన టైటిల్ సాంగ్ సూపర్ డూపర్ హిట్ అయింది. అంతకంటే ముందు రిలీజైన “ఏమైనదో” అనే పాట కూడా హిట్ అయింది. ఈ రెండు పాటలతో పాటు సినిమాలో మిగిలిన 4 పాటల్ని కలిపి ఈరోజు జూక్ బాక్స్ గా విడుదల చేశారు.

సినిమాలో పాటలన్నింటినీ శ్రీమణి ఒక్కడే రాశాడు. రమ్య, అర్మాన్, శ్రియ గోషల్ తో పాటు పలువురు ఆలపించారు. వెంకీ అట్లూరి డైరక్ట్ చేసిన ఈ సినిమాను ఈనెల 25న గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు.