ఇప్పట్లో థియేటర్లు తెరుచుకోవు

Saturday,May 16,2020 - 01:50 by Z_CLU

ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో సినిమా హాళ్ళు మూతపడిన సంగతి తెలిసిందే. అయితే ఈ నెల 29తో లాక్ డౌన్ ముగిస్తుందనే టాక్ తో ఇక థియేటర్స్ కూడా ఓపెన్ అవుతాయనే ఆశతో ఉన్నారు నిర్మాతలు. తాజాగా ఈ విషయంపై సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ క్లారిటీ ఇచ్చారు.

లాక్ డౌన్ ఎత్తేసినప్పటికీ ఇప్పట్లో థియేటర్స్ ఓపెన్ చేయడం కుదరదని అన్నారు. పరిస్థితి చక్కబడే వరకు… అంటే మరో 2-3 నెలల వరకు థియేటర్స్ ఓపెన్ అవ్వకపోవడం మంచిదన్నారు.

దీంతో థియేటర్లు ఇప్పట్లో తెరుచుకోవనే విషయంపై క్లారిటీ వచ్చేసినట్టే. ఇప్పటికే కొన్ని సినిమాలు రిలీజ్ కి రెడీ గా ఉన్నాయి. మరోవైపు కొందరు దర్శక-నిర్మాతలు షూటింగ్ పర్మిషన్ ఎప్పుడు వస్తుందో అని ఎదురుచూస్తున్నారు.

చూస్తుంటే, చిత్ర పరిశ్రమలో మళ్ళీ సందడి మొదలవ్వడానికి ఇంకాస్త టైం పట్టేలా కనిపిస్తుంది.