Movie Review - 'అలాంటి సిత్రాలు'

Friday,September 24,2021 - 08:47 by Z_CLU

నటీనటులు: అజయ్ కతుర్వార్, యష్ పురి, ప్రవీణ్ యండమూరి, శ్వేతా పరాశర్, తన్వి ఆకాంక్ష , రవి వర్మ , దయానంద రెడ్డి తదితరులు

సంగీతం: సంతు ఓంకార్

కెమెరా: కార్తీక్ సాయి కుమార్

ఎడిటింగ్ & సౌండ్ డిజైన్: అశ్వథ్‌ శివకుమార్

సమర్పణ: కె. రాఘవేంద్ర రెడ్డి

నిర్మాత: రాహుల్ రెడ్డి

దర్శకత్వం: సుప్రీత్ సి. కృష్ణ

విడుదల : 24 సెప్టెంబర్ 2021

ప్రతీ వారం కొన్ని చిన్న సినిమాలు రిలీజ్ అవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఈ వారం కూడా అలాంటి సిత్రాలు అనే ఓ చిన్న సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జీ5 లో విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది ? కొత్త వాళ్ళు కొత్త కంటెంట్ తో వచ్చారా ? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.

“సిచ్యుయేషన్స్ టెస్ట్ చేసినప్పుడు మనం బ్రతకడానికి ఏ పనిచేసినా దానిలో తప్పులేదు. ఇది తప్పు అని చెప్పడానికి ఇక్కడ ఎవ్వడూ కరెక్ట్ కాదు. ఎవడి ప్రాస్టిట్యూషన్ వాడు చేస్తున్నాడు.”

సినిమాలోని ఈ ఒక్క డైలాగ్ టోటల్ థీమ్ ను చెబుతుంది.  ఇది కమర్షియల్ సినిమా కాదు, నిజాయితీగా చెప్పిన ఓ ఎమోషనల్ కథ. అందుకే ఇందులో మనకు హీరోలు కనిపించరు. అలా అని విలన్స్ కూడా కనిపించరు. పరిస్థితుల ప్రభావం వల్ల ఒకే పాత్ర కొన్ని చోట్ల విలన్ గా, మరికొన్నిచోట్ల హీరోగా కనిపిస్తుందంతే.  ప్రతి పాత్రకు ఓ అర్థం ఉంటుంది. ఆ క్యారెక్టర్ లో డెప్త్ కనిపిస్తుంది. కావాలని పెట్టినట్టు ఒక్క పాత్ర కూడా అనిపించదు. ఒక్క సీన్ కూడా కనిపించదు. అదే ఈ స్క్రీన్ ప్లేలో గమ్మత్తు. యాక్టర్స్, టెక్నీషియన్స్, డైరక్టర్ వర్క్ కచ్చితంగా ఇండస్ట్రీని ఎట్రాక్ట్ చేస్తుంది.

alanti sitralu movie review zeecinemalu

కొన్ని కథలు మనసుని హత్తుకొని మెప్పిస్తాయి. అలాంటి కథలు చూసినప్పుడు కలిగే అనుభూతి వేరు. సరిగ్గా ఇలాంటి మూడు కథల్ని కలిపి దర్శకుడు సుప్రీత్ తీసిన సినిమానే ‘అలాంటి సిత్రాలు’. అయితే నాలుగు ముఖ్య పాత్రలతో ఒకే కథతో కథగా అల్లిన సినిమా ఇది. కానీ నలుగురి జీవితాన్ని ఒకే కాన్ ఫ్లిక్ట్ తో చూపించి వారి మధ్య ఓ కనెక్షన్స్ క్రియేట్ చేసి మెప్పించాడు దర్శకుడు. తను రాసుకున్న కథను అనుకున్న విధంగానే తెరకెక్కించాడు సుప్రీత్. కాకపోతే స్లో నెరేషన్ ఇబ్బంది పెడుతుంది. ఇక మొదటి భాగంలో పాత్రలను పరిచయడానికి సమయం తీసుకున్న దర్శకుడు రెండో భాగాన్ని మంచి ఎమోషనల్ సీన్స్ తో ముందుకు నడిపించి ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. ఓవరాల్ గా ఓ నలుగురు జీవితాన్ని అద్దం పట్టేలా స్క్రీన్ పై చూపించే ప్రయత్నం చేసి అందులో సక్సెస్ అయ్యాడు దర్శకుడు. అలాగే కథను సైడ్ ట్రాక్ చేసే కమర్షియల్ అంశాల జోలికి వెళ్ళకుండా నిజాయితిగా తను చెప్పాలనుకున్నది చెప్పాడు సుప్రీత్. ఆ విషయంలో దర్శకుడిని మెచ్చుకోవాలి. అయితే క్లైమాక్స్ ఇంకా బాగా రాసుకోవచ్చు అనిపిస్తుంది.

alanti sitralu movie review zeecinemalu

కొత్త వాళ్ళు అయినప్పటికీ అజయ్, యష్, శ్వేతా, తన్వి ఆకాంక్ష చాలా బాగా నటించి పాత్రలకు పర్ఫెక్ట్ అనిపించుకున్నారు. ఇక నటుడిగా కాస్త అనుభవం ఉన్న ప్రవీణ్ యండమూరి కూడా సినిమాకు ప్లస్ అయ్యాడు. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సీన్స్ లో మంచి మార్కులు అందుకున్నాడు. వేశ్య పాత్రలో శ్వేతా పరశార్ మంచి నటన కనిపించింది. తన్వి ఆకాంక్ష టీనేజ్ అమ్మాయి పాత్రలో ఎట్రాక్ట్ చేసింది. కోచ్ పాత్రలో రవివర్మ, దియా పాత్రలో నటించిన పాప బాగా నటించారు.

alanti sitralu movie review zeecinemalu

సంతు ఓంకార్ సినిమాటోగ్రఫీ పరవాలేదు. అక్కడక్కడా తన కెమెరా వర్క్ తో ఎట్రాక్ట్ చేశాడు. సాయి కార్తీక్ కుమార్ మ్యూజిక్ సినిమాకు హైలైట్ గా నిలిచింది. అన్ని పాటలు వినసొంపుగా ఉన్నాయి. అలాగే నేపథ్య సంగీతం కూడా మంచి ఇంపాక్ట్ తీసుకొచ్చింది. అశ్వత్ శివకుమార్ ఎడిటింగ్ అండ్ సౌండ్ డిజైనింగ్ బాగుంది. మిగతా టెక్నీషియన్స్ అందరూ తమ ఎఫర్ట్ పెట్టి పని చేశారు. అక్కడక్కడా వచ్చే మాటలు కూడా ఆకట్టుకున్నాయి. కథ-స్క్రీన్ ప్లే మరీ కొత్తగా అనిపించవు కానీ, పాత్రల్ని కలిపిన విధానం, సెకెండాఫ్ నెరేషన్ సూపర్. నిర్మాణ విలువలు కథకి తగ్గట్టుగా ఉన్నాయి.

ఫైనల్ గా ‘అలాంటి సిత్రాలు’ ప్రేక్షకులను ఆకట్టుకొని మంచి ఫీల్ గుడ్ ఎమోషనల్ సినిమా అనిపించుకుంటుంది.  ఎమోషనల్ రైడ్స్ ఇష్టపడే వారికి కచ్చితంగా ఇది నచ్చుతుంది.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics