రికార్డులపై రికార్డులు

Monday,March 20,2017 - 12:40 by Z_CLU

బిగ్గెస్ట్ మ్యాగ్నం ఓపస్ బాహుబలి 2 కి క్రియేట్ అయి ఉన్న హై ఎండ్ డిమాండ్ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ పెరుగుతూనే ఉంది. దానికి తోడు రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రేలర్, సినిమాని ఎప్పుడెప్పుడు చూస్తామా క్యూరాసిటీ ని పీక్ కి తీసుకువెళ్ళింది. ఇప్పటికే 85 మిలియన్ వ్యూస్ ని రికార్డ్ చేసిన బాహుబలి ట్రేలర్ ఇప్పటికీ సెకను సెకనుకి వ్యూస్ ని పెంచుకునే పనిలోనే ఉంది.

కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు లాంటి కీ సస్పెన్స్ ఎలిమెంట్ తో పాటు అల్టిమేట్ విజువల్ వండర్ గా తెరకెక్కిన బాహుబలి, ఏప్రియల్ 28 నుండి వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో ఎంటర్ టైన్ చేయనుంది.

కీరవాణి మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ ని గ్రాండ్ గా ప్లాన్ చేస్తుంది సినిమా యూనిట్. రామోజీ ఫిలిం సిటీలో మార్చ్ 26 న జరగనున్న ఈ ఈవెంట్ కోసం ఇప్పటికే ఏర్పాట్లు బిగిన్ చేసేసింది సినిమా యూనిట్. ఓ వైపు ట్రేలర్ కి వస్తున్న ఎక్స్ ట్రా ఆర్డినరీ రెస్పాన్స్  కి ఈ మ్యూజికల్ మ్యాజిక్ కూడా ఆడ్ అయితే బాహుబలి మానియా నెక్స్ట్ లెవెల్ కి రీచ్ అవ్వడం ఖాయం.