అరవింద సమేతలో మోస్ట్ టఫ్ఫెస్ట్ సీన్

Wednesday,October 10,2018 - 05:06 by Z_CLU

సరిగ్గా సమ్మర్ లో సెట్స్ పైకి వచ్చింది అరవింద సమేత. ఫస్ట్ షెడ్యూల్ లోనే సినిమాలో భారీ ఇంపాక్ట్ క్రియేట్ చేసే యాక్షన్ ఎపిసోడ్స్ ని ప్లాన్ చేసుకున్నారు త్రివిక్రమ్ అండ్ టీమ్. ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ ఈ ఎపిసోడ్ లోని సీన్స్ తెరకెక్కించే ప్రాసెస్ NTR పడ్డ కష్టం, డెడికేషన్ ఏ స్థాయిలో ఉండిందో ఎక్స్ ప్లేన్ చేశాడు త్రివిక్రమ్.

ఏకంగా 48 డిగ్రీల హీట్ లో రిఫ్లెక్టర్స్ మధ్య షర్ట్ లేకుండా, కొన్ని పర్టికులర్ షాట్స్ కోసం కనీసం వాటర్ కూడా తాగకుండా పర్ఫామ్ చేశాడట NTR. అంత టఫ్ సిచ్యువేషన్ లో కూడా రెండున్నర రోజులు అంతే కూల్ గా కో ఆపరేట్ చేశాడట NTR. ఈ విషయాన్ని  స్వయంగా ఈ సినిమా దర్శకుడు త్రివిక్రమ్, రీసెంట్ గా మీడియాతో షేర్ చేసుకున్నాడు.

బేసిగ్గా NTR లో తనకు నచ్చే చాలా పాయింట్స్ ఉన్నాయని చెప్పుకున్న త్రివిక్రమ్, ఆ రోజు మాత్రం ఆయన డెడికేషన్ చూసి షాకయ్యానని చెప్పుకున్నాడు. ఆ యాక్షన్ సీక్వెన్సెస్ థియేటర్స్ లో వైబ్రేషన్స్ క్రియేట్ చేయడం గ్యారంటీ అని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.