స్పైడర్ క్లైమాక్స్ లో మోస్ట్ ఇంటరెస్టింగ్ పాయింట్

Monday,September 25,2017 - 10:52 by Z_CLU

మహేష్ బాబు స్పైడర్ మరో రెండు రోజుల్లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. అల్టిమేట్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా కోసం ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్సెస్ లలో మహేష్ బాబు డూప్ లేకుండా, తన స్టంట్స్ తానే స్వయంగా చేయడం ఫ్యాన్స్ లో వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తుంటే, స్పెషల్ గా ఈ సినిమా క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్సెస్ సినిమాపై మరింత ఇంట్రెస్ట్ ని జెనెరేట్ చేస్తున్నాయి.

స్పైడర్ క్లైమాక్స్ లో మొత్తం 1000 మంది ఫైటర్స్ తో యాక్షన్ సీక్వెన్సెస్ తెరకెక్కితే, అందులో 400 మంది లేడీ ఫైటర్స్ గాల్లో ఎగురుతూ, జంప్ చేస్తూ చేసే ఎక్స్ ట్రా ఆర్డినరీ ఫైట్ సీక్వెన్సెస్ ఆడియెన్స్ ని మెస్మరైజ్ చేయబోతున్నాయి. ఈ సీక్వెన్సెస్ కోసం సినిమా యూనిట్ మొదట్లో చెన్నైలో సెట్ వేసుకున్నా, పెద్ద పెద్ద బిల్డింగ్స్ కొలాప్స్ అవ్వడం లాంటి భారీ విజువల్స్ ని తెరకెక్కించడం కోసం వియత్నాం లో దాదాపు 25 రోజుల నాన్ స్టాప్ షూటింగ్ జరుపుకుంది. ఈ ప్రాసెస్ లో ఫిజికల్ స్ట్రెస్ ని బ్యాలన్స్ చేసుకోవడం కోసం మహేష్ బాబు ఒక ఫిజియోథెరపిస్ట్ ని హైర్ చేసుకుని మరీ ఈ షూటింగ్ లో పాల్గొన్నాడు.

 

హై ఇంటెన్సివ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా మహేష్ బాబు కరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిపోనుందని ఖాయం అంటున్నాయి  ట్రేడ్ వర్గాలు. A.R. మురుగదాస్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ బాబు సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. హారిస్ జయరాజ్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. N.V.ప్రసాద్, ఠాగూర్ మధు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు.