మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్

Wednesday,May 16,2018 - 06:31 by Z_CLU

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్టు పెరిగిపోతుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కంప్లీట్ ఫోకస్ సినిమాలపైనే పెట్టిన మన హీరోలు ఓ వైపు ఏజ్ పెరిగిపోతున్నా సినిమాలకే ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటున్నారు. కెరీర్ తర్వాత పెళ్లి గురించి ఆలోచిస్తామంటున్నారు.

 

ప్రభాస్ : ప్రభాస్ పెళ్లి కబుర్లు ఇప్పటివి కాదు. బాహుబలి ముందు నుంచి ప్రభాస్ పెళ్లిపై రోజుకో రూమర్ నడుస్తూనే ఉంది. బాహుబలి-2 రిలీజైన తర్వాత ఈ హీరో పెళ్లి చేసుకుంటాడని అంతా ఎక్స్ పెక్ట్ చేశారు. కానీ సాహో స్టార్ట్ చేశాడు. మరి సాహో తర్వాతైనా పెళ్లి చేసుకుంటాడో లేక మరో సినిమా సెట్స్ పైకి షిఫ్ట్ అవుతాడో చూడాలి.

 

నితిన్ : నితిన్ కూడా అంతే. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడమే తెలుసు ఈ హీరోకి. పెళ్లి గురించి అడిగితే మాత్రం తనకే తెలీదంటాడు. కనీసం అలాంటి ప్లాన్స్ కూడా మైండ్ లో లేవంటాడు. ఈమధ్య నితిన్ పెళ్లిపై కూడా పుకార్లు వచ్చాయి. అవేవీ పట్టించుకోకుండా వెండితెరపై పెళ్లి చేసుకుంటానంటూ.. శ్రీనివాసకల్యాణం షూటింగ్ తో బిజీ అయిపోయాడు.

 

తరుణ్ : ఫస్ట్ సినిమాతోనే లవర్ బాయ్ ఇమేజ్ సంపాదించుకున్న తరుణ్, ఇప్పటికీ అదే మూడ్ లో ఉన్నట్టున్నాడు. వయసు 35 క్రాస్ అయినా ‘కుర్రాడి’కి ఇంకా పెళ్లి ధ్యాస రాలేదు. ‘ఇది నా లవ్ స్టోరీ’ రీసెంట్ గా మరో ప్రేమకథ చూపించిన ఈ హీరో.. రియల్ లైఫ్ లో పెళ్లి పెళ్లి ఎప్పుడు చూపిస్తాడో.

 

రానా : పెళ్ళెప్పుడు రానా…? అనే క్వశ్చన్ కూడా కంప్లీట్ కాకముందే ‘ఇంకా ప్రభాస్ కే కాలేదు.. నాకేంటి తొందర.’ అని తప్పుకుంటాడు. ఈ టాలెస్ట్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ 33 ఏళ్ళు క్రాసవుతున్నా కాన్సంట్రేషన్ అంతా  సినిమాలపైనే. ఇతడి పెళ్లిపై కూడా చాలా రూమర్స్ వచ్చాయి. నిజంగా అవి రూమర్సే.

 

శర్వానంద్ : చూడ్డానికి క్యూట్ గా, మిల్క్ బాయ్ లో కనిపిస్తాడు. అప్పుడే కాలేజ్ కంప్లీట్ చేసుకొని సినిమాల్లోకి వచ్చాడా అనిపిస్తుంది. కానీ శర్వా కూడా ఎప్పుడో 30 దాటేశాడు. ఇంకా చెప్పాలంటే 30 క్రాస్ చేసి మూడేళ్లయింది. ‘పడి పడి లేచే మనసు’ అంటూ ప్రేమకథలు చేస్తున్న ఈ హీరో.. తన మనసులో ఉన్న పెళ్లి కహానీ మాత్రం బయటపెట్టడం లేదు.

 

నారా రోహిత్ :  డిఫెరెంట్ ట్రాక్ హీరో నారా రోహిత్ ది. ఏ సినిమా చేసినా డిఫెరెంట్ అనే మార్క్ పడాల్సిందే. అంత సీరియస్ గా తీసుకుంటాడు ప్రతి సినిమాని. కానీ పెళ్ళి విషయంలోనే ఏ క్లారిటీ ఇవ్వట్లేదు. ఈ హీరో వయసు 32.

 

నిఖిల్ : “పెళ్ళి అనేది చాలా ఇంపార్టెంట్, టైం వచ్చినప్పుడు తప్పకుండా చేసుకుంటాను.” ఏ ఇంటర్వ్యూలో అడిగినా ఇలాంటి డైలాగ్స్ మాత్రం బాగా చెబుతాడు నిఖిల్. కాలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీలు చేస్తున్నాడని ఇతడేదో టీనేజ్ అనుకోవద్దు. నిఖిల్ కు కూడా 32 ఏళ్లొచ్చాయి.

 

సందీప్ కిషన్ : యూత్ ఫుల్ ఎంటర్ టైనర్స్ తో ఎట్రాక్ట్ చేసే సందీప్ కిషన్ గట్టి హిట్ కట్టాలనే కసితో ఉన్నాడు. రీసెంట్ గా రిలీజైన ‘మనసుకు నచ్చింది’ సినిమాతో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఈ హీరోకి, 31 ఏళ్ళు వచ్చినా పెళ్ళి అనే ధ్యాస మాత్రం రావట్లేదు.

 

రామ్ : రీసెంట్ గా 30లోకి ఎంటరయ్యాడు ఈ హీరో. మొన్నటివరకు పెళ్లి కానీ ప్రసాదుల జాబితాలో ఈ హీరో లేడు. కానీ ఎప్పుడైతే 30 అనే నంబర్ లోకి ఎంటరయ్యాడో అప్పుడే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్ లోకి చేరిపోయాడు. మొన్నటివరకు ఇంటర్వ్యూల్లో పెళ్లికి సంబంధించి పెద్దగా క్వశ్చన్స్ ఫేస్ చేయలేదు రామ్. ఇకపై అలాంటి ప్రశ్నలు తప్పకపోవచ్చు. గెట్ రెడీ రామ్.