సమ్మర్ ఎట్రాక్షన్ గా Most Eligible Bachelor

Thursday,January 14,2021 - 11:51 by Z_CLU

అఖిల్ అక్కినేని హీరోగా అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో GA2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై వస్తున్న సినిమా “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో రెడీ అవుతున్న ఈ సినిమాను బన్నీ వాసు, మరో నిర్మాత ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వాసు వర్మ తో కలిసి నిర్మిస్తున్నారు.

అఖిల్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్” సినిమాను సమ్మర్ ఎట్రాక్షన్ గా రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా మరో బ్రాండ్ న్యూ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

నిజానికి ఈ సినిమాను సంక్రాంతికి అనుకున్నారు. కానీ ఇప్పుడు వేసవికి షెడ్యూల్ చేశారు. డేట్ ఇంకా ఫిక్స్ చేయలేదు. గోపీసుందర్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. ఈ సినిమాలో సిద్ శ్రీరామ్ పాడిన పాటకు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

లవ్-రొమాంటిక్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాతో గ్యారెంటీగా హిట్ కొడతానంటున్నాడు అఖిల్ అక్కినేని.