#MEB - సంక్రాంతి రిలీజ్ ఫిక్స్

Monday,October 19,2020 - 03:54 by Z_CLU

Most Eligible Bachelor సినిమాకు సంబంధించి మరోసారి ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమా తప్పనిసరిగా సంక్రాంతికే వస్తుందని మేకర్స్ మరోసారి ప్రకటించారు. దసరా కానుకగా 25న ఈ సినిమా టీజర్ రిలీజ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి ప్రీ-టీజర్ వీడియో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మూవీ రిలీజ్ పై మరోసారి క్లియర్ గా ఎనౌన్స్ మెంట్ ఇచ్చారు.

సినిమా షూటింగ్ ఇప్పటికే 80శాతం పూర్తయింది. మిగతా షూటింగ్ కూడా ప్రస్తుతం నడుస్తోంది. డిసెంబర్ చివరి నాటికి ఫస్ట్ కాపీ రెడీ చేయాలనేది టార్గెట్. #AkhilAkkineni కెరీర్ లో ఫస్ట్ సంక్రాంతి రిలీజ్ ఇదే.

సంక్రాంతికి చాలా సినిమాలు వస్తున్నట్టు రూమర్స్ వచ్చాయి. కుదిరితే తమ సినిమాను సంక్రాంతికే రిలీజ్ చేస్తామంటూ చాలామంది ఎనౌన్స్ మెంట్స్ కూడా ఇచ్చారు. కానీ అఫీషియల్ గా సంక్రాంతి రిలీజ్ ఎనౌన్స్ చేసిన సినిమా ఇదే. దీంతో పాటు నితిన్ హీరోగా నటిస్తున్న రంగ్ దే కూడా సంక్రాంతికే రాబోతోంది.

Also Read – మోస్ట్ ఎలిజిబుల్ పూజ