Most Eligible Bachelor - ఫస్ట్ వీకెండ్ కలెక్షన్

Monday,October 18,2021 - 04:45 by Z_CLU

Most Eligible Bachelor First Weekend Collection

ఓవైపు మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికీ.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ థియేటర్లలో మంచి హోల్డ్ సంపాదించింది. అఖిల్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా ఫస్ట్ వీక్ కంప్లీట్ చేసుకుంది. ఈ 3 రోజుల్లో ఈ సినిమాకు వరల్డ్ వైడ్ ఏకంగా 24 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది.

తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఏపీలో సెకండ్ షోలకు అనుమతి ఇవ్వడం, ఆక్యుపెన్సీ రూల్స్ ను సడలించడం ఈ సినిమాకు బాగా కలిసొచ్చింది. మొదటి రోజు ఈ సినిమాకు ఏపీ+నైజాంలో 5 కోట్ల 45 లక్షల రూపాయల షేర్ వచ్చింది. సెకెండ్ డే 4 కోట్ల 54 లక్షలు, మూడో రోజు ఆదివారం 4 కోట్ల 3 లక్షల రూపాయల షేర్ వచ్చింది. అలా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 14 కోట్ల రూపాయలకు పైగా షేర్ వచ్చింది.

అటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా బాగా పెర్ఫార్మ్ చేస్తోంది. మరికొన్ని గంటల్లో బ్రేక్ ఈవెన్ కూడా అందుకోబోతోంది. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.. ఓవర్సీస్ లో ఈ సినిమాకు 4 లక్షల 36వేల డాలర్ల వసూళ్లు వచ్చాయి. తాజా వసూళ్లతో ఇది హాఫ్ మిలియన్ మార్క్ అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

సినిమా సక్సెస్ ను రేపు గ్రాండ్ గా సెలబ్రేట్ చేయబోతున్నారు. ఈ మేరకు హైదరాబాద్ లో ఏర్పాట్లు చేస్తున్నారు. రేపటి సక్సెస్ సంబరాలకు స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా వస్తున్నాడు.

ఏపీ, నైజాం 3 డేస్ షేర్
నైజాం – 5.41 కోట్లు
సీడెడ్ – 2.94 కోట్లు
ఉత్తరాంధ్ర – 1.67 కోట్లు
ఈస్ట్ – 86 లక్షలు
వెస్ట్ – 70 లక్షలు
గుంటూరు – కోటి 3 లక్షలు
కృష్ణా – 80 లక్షలు
నెల్లూరు – 61 లక్షలు

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics