అనుష్క ''సైలెన్స్'' లో హాలీవుడ్ స్టార్

Sunday,March 17,2019 - 03:15 by Z_CLU

అనుష్క‌, మాధ‌వ‌న్ కాంబినేష‌న్ లో వస్తున్న సినిమా “సైలెన్స్”. ఇప్పుడీ ప్రాజెక్టులోకి ఓ హాలీవుడ్ స్టార్ వచ్చి చేరాడు. దాదాపు 100కి పైగా సినిమాల్లో న‌టించిన కిల్ బిల్ ఫేమ్ మైఖేల్ మ్యాడ‌స‌న్ ఈ మూవీలో న‌టిస్తున్నారు. మ్యాడ్సన్ నటిస్తున్న తొలి ఇండియన్ సినిమా ఇదే.

ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ్, హిందీ భాష‌ల్లో నిర్మిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, కోన ఫిలిం కార్పోరేష‌న్ సంస్థ‌తో క‌లిసి.. టాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ న‌టీన‌టుల‌తో ఈ సినిమాని నిర్మిస్తోంది. అనుష్క తో పాటు సుబ్బ‌రాజు, అంజ‌లి, షాలిని పాండే, అవ‌స‌రాల శ్రీనివాస్ త‌దిత‌రులు ఈ చిత్రంలో న‌టిస్తున్నారు.

ఏప్రిల్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి రాబోతోంది. యూఎస్ లోని సీయోట‌ల్ లో ఏప్రిల్ నుంచి జూన్ వ‌ర‌కు షూటింగ్ చేయబోతున్నారు. ఈ చిత్రానికి హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌ుడు. గోపీసుందర్ సంగీత దర్శకుడు.