మోసగాళ్ళు ట్రైలర్ రివ్యూ

Thursday,February 25,2021 - 07:33 by Z_CLU

Manchu Vishnu హీరోగా Jeffrey Gee Chin దర్శకత్వంలో తెరకెక్కుతున్న Mosagallu ట్రైలర్ విడుదలైంది. మెగా స్టార్ చిరంజీవి  సోషల్ మీడియా ద్వారా ట్రైలర్ రిలీజ్ చేశారు. USA లో జరిగిన అతిపెద్ద ఐటీ స్కామ్ నేపథ్యంలో స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి రెండు నిమిషాల నలబై సెకన్స్ ట్రైలర్ ని  విడుదల చేసి సినిమాపై బజ్ క్రియేట్ చేసారు.

“డబ్బు సంతోషాన్నిస్తుందనుకున్నా… డబ్బుసెక్యురిటీ ఇస్తుందనుకున్నా… ఒట్టేసుకున్నా  ఈ పేదరికం నుండి దూరంగా వెళ్ళిపోవాలని” అనే డైలాగ్ తో  హీరో విష్ణు బ్యాక్ షాట్ తో స్టార్ట్ అయిన ట్రయిలర్ లో కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ , డైలాగ్స్ , విజువల్స్ , మ్యూజిక్ హైలైట్ గా నిలిచాయి. సినిమాలో సునీల్ శెట్టి మోసగాళ్ళను పట్టుకునే పవర్ ఫుల్ పోలీస్ గా కనిపించనున్నాడని , అలాగే కాజల్, నవదీప్ , నవీన్ చంద్ర క్యారెక్టర్స్ సినిమాలో కీ రోల్స్ పోషించనున్నాయని ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. తమకి తెలిసిన టెక్నిక్స్ తో డబ్బు కోసం కొందరు మోసగాళ్ళు చేసిన అతి పెద్ద స్కామ్ తో స్టైలిష్ యాక్షన్ డ్రామాతో  సినిమా సాగుతుందని ట్రైలర్ తో క్లియర్ కట్ గా చెప్పారు.

 ఈ సినిమాకు మంచు విష్ణు రచయితగా పనిచేస్తుండటం విశేషం. AVA Entertainment and 24 Frames Factory బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాకు Sam C.S మ్యూజిక్ అందిస్తున్నాడు. త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.