బాహుబలి టీం రియాక్షన్..

Thursday,October 13,2016 - 01:36 by Z_CLU

 ఈ నెలంతా బాహుబలి-2 సినిమాకు సంబంధించి ఏదో ఒక వార్త హల్ చల్ చేయబోతోంది. ఈ విషయాన్ని జక్కన్న టీం ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించింది. మరోవైపు సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ కూడా రికార్డు స్థాయిలో జరుగుతోంది. మూవీ నైజాం రైట్స్ ఏకంగా 50కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయనే టాక్ నడుస్తోంది. దీంతో పాటు మిగతా ఏరియాస్ లో కూడా బిజినెస్ పూర్తయినట్టు తెలుస్తోంది.

siv_77560031

        ఇదిలా ఉండగా దాదాపు కీలకమైన అన్ని ఏరియాస్ లో బిజినెస్ పూర్తయింది కాబట్టి…మరోవైపు సినిమా షూటింగ్ కూడా డిసెంబర్ ఎండింగ్ నాటికి కంప్లీట్ అయిపోతోంది కాబట్టి… వీలైతే సినిమాను కాస్త ముందుగానే విడుదల చేసే ఆలోచనలో రాజమౌళి ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ఏప్రిల్ 28న కాకుండా… కుదిరితే ఏప్రిల్ మొదటివారంలోనే సినిమాను థియేటర్లలోకి తీసుకొస్తారంటూ రూమర్స్ వచ్చాయి. వీటిపై బాహుబలి టీం క్లారిటీ ఇచ్చింది. సినిమా కాస్త ముందుగానే కంప్లీట్ అయినప్పటికీ… రిలీజ్ డేట్ మాత్రం మార్చేది లేదని మరోసారి క్లారిటీ ఇచ్చింది.