బాలయ్య టైటిల్ అదేనా?

Saturday,May 30,2020 - 12:28 by Z_CLU

బోయపాటి శ్రీను డైరెక్షన్ లో మూడో సినిమా చేస్తున్నాడు బాలకృష్ణ.  లాక్ డౌన్ కంటే ముందు రామోజీ ఫిలిం సిటీ లో మొదటి షెడ్యుల్ పూర్తిచేశారు. ఈ షెడ్యుల్ లో యాక్షన్ ఎపిసోడ్ తో పాటు కొన్ని సన్నివేశాలు కూడా షూట్ చేసింది యూనిట్. ప్రస్తుతం రెండో షెడ్యుల్ కి రెడీ అవుతున్న ఈ సినిమాకు తాజాగా టైటిల్ ఫిక్స్ చేసినట్టు టాక్. సినిమాకు ‘మోనార్క్’ అనే డిఫరెంట్ టైటిల్ పెట్టబోతున్నారట.

నిజానికి బాలయ్య , బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాలకు ‘సింహ’, ‘లెజెండ్’ లాంటి పవర్ ఫుల్ టైటిల్స్ పెట్టుకున్నారు. ఈసారి క్యారెక్టర్ కి అనుగుణంగా డిఫరెంట్ టైటిల్ పెట్టి ఫ్యాన్స్ కి త్వరలోనే అప్డేట్ కూడా ఇవ్వడానికి రెడీ అవుతున్నారట.

మరోవైపు ఈ సినిమాలో ఓ కొత్తమ్మాయిని హీరోయిన్ గా పరిచయం చేస్తున్నారు. ఆ కొత్త హీరోయిన్ డీటెయిల్స్ కూడా లాక్ డౌన్ తర్వాత అఫీషియల్ గా ప్రకటిస్తారు.