శ్రీదేవి 'మామ్' మూవీ ప్రత్యేకతలు

Thursday,May 25,2017 - 10:04 by Z_CLU

శ్రీదేవి మెయిన్ రోల్ లో రవి ఉద్యవార్‌ దర్శకత్వంలో మ్యాడ్‌ ఫిలింస్‌, థర్డ్‌ ఐ పిక్చర్స్‌ బ్యానర్స్ పై తెరకెక్కుతున్న మూవీ ‘మామ్‌’.. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం భాషల్లో ఒకే సారి తెరకెక్కుతున్న ఈ సినిమాకు చాలా ప్రత్యేకతలతో ఎంటర్టైన్ చేయబోతుంది. మరి ఆ ప్రత్యేకతలేంటో చూద్దాం..

ప్రస్తుతం నటిగా శ్రీదేవి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుబోతున్న తరుణంలో శ్రీదేవి నుంచి వస్తున్న సినిమా ‘మామ్’ ఇదొక ప్రత్యేకత కాగా.. ఈ సినిమాను శ్రీదేవి భర్త బోని కపూర్ నిర్మిస్తుండడం, శ్రీదేవి నటించిన మొదటి సినిమా విడుదలైన జూలై 7 నే ఈ సినిమా కూడా థియేటర్స్ లోకి రానుండడం మరో ప్రత్యేకతలు. ఈ ప్రత్యేకతలతో పాటు ఈ సినిమాకు సంబంధించి మరో ప్రత్యేకత కూడా ఉంది.. మామ్ సినిమాకు సంబంధించి నాలుగు భాషల్లో శ్రీదేవే స్వయంగా డబ్బింగ్ చెప్పబోతుండడం మరో విశేషం అనే చెప్పాలి. ఇలా శ్రీదేవి నటిస్తున్న మామ్ సినిమా చాలా ప్రత్యేకతలతో నాలుగు భాషల ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతుంది.