మోహన్ లాల్ కనుపాప రిలీజ్ కి రెడీ
Thursday,January 12,2017 - 07:00 by Z_CLU
జనతా గ్యారేజ్ తో తెలుగులో కూడా పాప్యులర్ అయిన మోహన్ లాల్, మొన్నటికి మొన్న మన్యంపులి సినిమాతో తెలుగు ఆడియెన్స్ కి మరింత క్లోజ్ అయ్యాడు. డిఫెరెంట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన మోహన్ లాల్ ఇప్పుడు కనుపాప సినిమాతో మరోసారి తెలుగు ఆడియెన్స్ ని మెస్మరైజ్ చేయనున్నాడు.
ఈ సినిమాలో అంధుడిగా నటించిన మోహన్ లాల్, ఒక అపార్ట్ మెంట్ లో లిఫ్ట్ ఆపరేట్ గా పని చేస్తున్నాడు. ఒకరోజు ఆ అపార్ట్ మెంట్ లో జరిగిన హత్యను అంధుడైన ఆ లిఫ్ట్ ఆపరేటర్ ఎలా ఛేదించాడు..? హంతకుడిని ఎలా పట్టుకున్నాడు..? అనే కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా హిందీ, కన్నడ భాషలలోను రీమేక్ అవుతుంది.
ఇప్పటికే డబ్బింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ‘కనుపాప’ సినిమాని ఫిబ్రవరి 3 న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తుంది సినిమా యూనిట్.