డైలాగ్ కింగ్ యాక్షన్ షురూ

Saturday,July 29,2017 - 12:36 by Z_CLU

2015 లో ‘మామ మంచు అల్లుడు కంచు’ సినిమాలో కనిపించిన మోహన్ బాబు తనాన్ నెక్స్ట్ సినిమాని నిన్ననే లాంచ్ చేశాడు. మంచు కుటుంబ సభ్యుల మధ్య గ్రాండ్ లాంచ్ అయిన ఈ సినిమాకి ‘గాయత్రి’ అని టైటిల్ ఫిక్స్ చేసింది సినిమా యూనిట్. ఈ సినిమాకి మదన్ డైరెక్టర్. తమన్ మ్యూజిక్ కంపోజర్.

గతంలో 2015 లో ‘మామ మంచు అల్లుడు కంచు’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. మళ్ళీ రెండేళ్ళ గ్యాప్ తరవాత మోహన్ బాబు లీడ్ రోల్ పోషిస్తున్న ఈ సినిమా ఏ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనుందో ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ ప్రాసెస్ లో ఉన్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో బిగిన్ కానుంది.