మోహన్ బాబు గాయత్రి ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్

Friday,December 22,2017 - 04:51 by Z_CLU

మోహన్ బాబు గాయత్రి ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్సయింది. నిఖిలా విమల్ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమా ఇవాల్టితో తో సక్సెస్ ఫుల్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఫిబ్రవరి 9 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమా ఇవాళ్టి నుండి పోస్ట్ ప్రొడక్షన్ పనులు బిగిన్ చేసింది.

మంచు విష్ణు పవర్ ఫుల్ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమాలో విష్ణు సరసన శ్రియ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ నెల 25  న ఈ మూవీ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయనుంది గాయత్రి టీమ్.

తమన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాలో బ్రహ్మానందం, అనసూయ భరద్వాజ్ కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమాను మోహన్ బాబు నిర్మిస్తున్నారు.