మహానటి టీమ్ ని అభినందించిన మోహన్ బాబు

Tuesday,May 15,2018 - 07:43 by Z_CLU

మహానటి రిలీజయినప్పటి నుండి ఫిల్మ్ మేకర్స్ పై ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. ఆడియెన్స్ నుండి వస్తున్న రెస్పాన్స్, కలెక్షన్స్ పక్కన పెడితే, టాలీవుడ్ ప్రముఖులు టీమ్ ని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. ఇప్పుడు మోహన్ బాబు కూడా ఈ టీమ్ ని ప్రత్యేకంగా అభినందించాడు.

ఈ సినిమాలో S.V. రంగారావు రోల్ లో నటించి మెప్పించిన మోహన్ బాబు, మహానటి టీమ్ డిన్నర్ కి ఇన్వైట్ చేసి ప్రత్యేకంగా అభినందించారు. వీటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. సీనియర్ నటి సావిత్రి బయోపిక్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రొడక్షన్ వ్యాల్యూస్ దగ్గరి నుండి మొదలు పెడితే ప్రతి ఎలిమెంట్ ఆడియెన్స్ ని మెస్మరైజ్ చేస్తుంది.

మొన్న మెగా స్టార్… నిన్న అల్లు అరవింద్, బన్నీ.. ఈ రోజు మోహన్ బాబు కుటుంబం ఇలా వరుసగా టాలీవుడ్ ప్రముఖుల అభినందనలు అందుకుంటుంది మహానటి టీమ్.