మిస్టర్ ఫస్ట్ సింగిల్ ఇవాళే రిలీజ్

Monday,March 20,2017 - 01:40 by Z_CLU

మిస్టర్ ఫస్ట్ సింగిల్ తో రెడీ అయిపోయాడు మిస్టర్. వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ‘మిస్టర్’ ఏప్రియల్ 7 నుండి థియేటర్స్ లో హంగామా చేయడానికి సిద్ధంగా ఆంది. ఈ లోపు బ్యాలన్స్ ఉన్న పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా కంప్లీట్ చేసుకునే పనిలో ఉన్న సినిమా యూనిట్ ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేస్తుంది. అయితే ఈ రిలీజ్ సోషల్ మీడియాలో చెయ్యట్లేదు.

మిస్టర్ ఫస్ట్ సాంగ్ ఈ రోజు మ్యాగ్జిమం అన్ని FM స్టేషన్ లలో 5:20 కి రిలీజ్ చేస్తుంది మిస్టర్ టీం. ఏ సినిమాకి మిక్కీ జె. మేయర్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. ‘ఏదో ఏదో బాగుందే’ అంటూ సాగే ఈ మెలోడియస్ ట్రాక్ ని రాహుల్ పాడాడు. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాశాడు.

శ్రీనువాట్ల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి, హెబ్బా పటేల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ లవ్ ఎంటర్ టైనర్ ని నల్లమలుపు బుజ్జి, ఠాగూర్ మధు కలిసి నిర్మిస్తున్నారు.