ఎక్స్ క్లూజివ్ : మిష్తీ చక్రవర్తి ఇంటర్వ్యూ

Thursday,June 27,2019 - 10:03 by Z_CLU

‘బుర్రకథ’ లో ఆది సరసన నటించింది మిష్తీ చక్రవర్తి. సినిమాల ఎంపిక విషయంలో చాలా చూజీగా ఉండే ఈ బాలీవుడ్ భామ ‘బుర్రకథ’ సక్సెస్ గ్యారంటీ అని చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. ఈ సందర్భంగా ‘జీ సినిమాలు’ తో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడింది. అవి మీకోసం..

సినిమాలో నా క్యారెక్టర్…

సినిమాలో నా పేరు హ్యాప్పీ… ఇక పర్టికులర్ గా నా క్యారెక్టర్ వరకు వచ్చేసరికి హీరోలో ఉండే 2 క్యారెక్టర్స్ అభి.. ఇంకా రామ్ ల లవ్ ఇంట్రెస్ట్ లా నటించాను. ఒకే బాడీలో ఉండే వీళ్ళిద్దరినీ ఎలా డీల్ చేస్తాను.. అనేది సినిమాలో చాలా ఫన్ గా ఉంటుంది.

మదర్ తెరిసా అంటే…

ఇప్పుడు ఎవరైనా మదర్ తెరిసా ఫాలోవర్ అనుకుంటే వాళ్ళు ఎప్పుడూ ఒకేలా ఆలోచిస్తారు. కానీ ఇక్కడ నా క్యారెక్టర్ వన్ అవర్ మదర్ తెరిసా.. అంటే ఈ వన్ అవర్ ఒకలా ఉంటుంది .. మరి మిగతా టైమ్ లో…?  అది స్క్రీన్ పై చూడాల్సిందే…

చాలా ఆఫర్స్ వస్తున్నాయి…

బాలీవుడ్ లో కూడా నాకు చాలా ఆఫర్స్ వస్తున్నాయి. ‘కాంచి’ సినిమాతో నా కరియర్ బిగిన్ అయింది. ఆ తరవాత విద్యా బాలన్ తో ‘బేగం జాన్’ చేశాను. ఆ సినిమాలో కూడా నా క్యారెక్టర్ కి మంచి పేరు వచ్చింది. వివేక్ ఒబెరాయ్ తో ‘గ్రేట్ గ్రాండ్ మస్తీ’ కూడా చేశాను…

ఇంకా నిర్ణయం తీసుకోవాలి…

బాలీవుడ్ లో నెక్స్ట్ ఏంటన్నది ఇంకా నిర్ణయం తీసుకోవాలి. ఏదైనా విమెన్ ఓరియంటెడ్ స్క్రిప్ట్ అయితే బావుంటుందని చూస్తున్నా.. చాలా చూజీగా స్క్రిప్ట్స్ ఎంచుకుంటున్నాను…

‘బుర్రకథ’ కూడా అంతే

తెలుగులో చాలా ఆఫర్స్ వస్తున్నాయి. ఎందుకో ఈ కథ వినగానే చేసేయాలనిపించింది. అంతే…

ఈ సినిమా గురించి…

‘బుర్రకథ’ అందరూ ఫ్యామిలీస్ తో చూడదగ్గ సినిమా. సినిమాలో యాక్షన్ ఉంటుంది.. ఫన్ ఉంటుంది.. ఎమోషన్స్ ఉంటాయి.. ఈ వీకెండ్ మిస్సవ్వకుండా చూడాల్సిన సినిమా…