టాలీవుడ్ లో స్టార్ట్ అయిన మైండ్ గేమ్

Wednesday,June 19,2019 - 01:06 by Z_CLU

ఒకే కథ… కానీ 2 సినిమాలు… ఇక్కడ కథ ఒకటే అనగానే సినిమాలో ప్రతీది ఒకేలా ఉండబోతుందని కాదు. 2 డిఫెరెంట్ జోనర్స్… ప్రస్తుతం రిలీజ్ కి రెడీ అవుతున్న బుర్రకథ, రామ్ నటించిన మాస్ ఎంటర్ టైనర్ ‘ఇస్మార్ట్ శంకర్’ రెండింటి బేసిక్ స్టోరీలైన్ ఒకటే… కానీ సినిమాలు కంప్లీట్ గా వేరు…

ఇస్మార్ట్ శంకర్ పూరి జగన్నాథ్ మార్క్ సినిమా. ఇప్పటికే ఈ సినిమా సోషల్ మీడియాలో నెక్స్ట్ లెవెల్ వైబ్స్ క్రియేట్ చేస్తుంది. ఎనర్జిటిక్ స్టార్ అనిపించుకున్న రామ్ లోని మరో ఆంగిల్ ని ప్రెజెంట్ చేస్తున్నాడు దర్శకుడు పూరి. ఇక పోతే ఈ డబల్ దిమాగ్ అసలు కథని ఇంకా సస్పెన్స్ గా ఉంచారు మేకర్స్..

‘బుర్రకథ’ కంప్లీట్ గా వేరు. ఓ రకంగా చెప్పాలంటే సినిమా మొత్తం అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ ఎంటర్టైనర్. టీజర్ రిలీజైనప్పుడే ‘ఈ సినిమా కొంచెం డిఫెరెంట్ గా ఉండేలా అనిపిస్తుందే..’ అనే టాక్ ని సక్సెస్ ఫుల్ గా ఎస్టాబ్లిష్ చేసుకుంది.  ఈ సినిమాలో డబల్ దిమాగ్ తో కనిపించబోయేది ఆది సాయి కుమార్.

సినిమాలోని హీరో క్యారెక్టర్స్ కి కాస్త దగ్గర పోలికలున్నాయి అనిపించినప్పటికీ సినిమాలు మాత్రం అస్సలు దగ్గర పోలికలున్నవి కావు.. బుర్రకథ.. బుర్రకథే… ఇస్మార్ట్ శంకర్ దీ ప్రత్యేకతే.. దేని మైండ్ గేమ్ దానిదన్నమాట.